
తెలంగాణ రక్షణ సేన చీఫ్.. కల్వకుంట్ల కవిత వధువు మెడలో తాళి కట్టారు. షాక్ అవ్వాల్సిన పనిలేదు. ఇదంతా సంప్రదాయంలో భాగమే.. నిన్న ఓ పెళ్లికి వెళ్లిన కవితను వరుడు మీ చేతులమీదుగా తంతు జరగాలని భావించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ – కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది.
యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు.. కవిత ముఖ్య అనుచరుల్లో ఒకరిగా ఉన్నాడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్‌కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. వివాహ వేడుక మంగళవారం ఘనంగా జరిగింది.
ఈ క్రమంలోనే.. బాలప్రసాద్ – శివాని వివాహ ముహూర్తం సమయంలో… తనకు అక్కాచెల్లెళ్లు లేరని.. ఆడబిడ్డగా మీరే వధువు మెడలో తాళి కట్టాలని కవితను బాలప్రసాద్ కోరాడు.. బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత గారు
ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం ఆడబిడ్డగా వివాహం జరిపించిన కవిత గారు
తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు.… pic.twitter.com/0hEsqsczQv
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) August 26, 2026