Telangana: ఈ కిలాడీ లేడీలు మహా ముదురు..! టార్గెట్ ఫిక్స్ చేస్తే.. అంతే సంగతులు!

|

Oct 05, 2024 | 9:53 PM

బంగారం వ్యాపారులే టార్గెట్‌. మాటల్లోకి దించి.. నమ్మించి.. చివరికి దోచుకోవడం ఆ మాయలేడీలకు వెన్నతో పెట్టిన విద్య. చీటింగ్‌ చేయడం, విలాసవంతంగా బతకడం.. అదే వాళ్ల టార్గెట్‌. ఈ కిలాడీ లేడీలు టార్గెట్ ఫిక్స్ చేస్తే, చోరీ చేసిందాకా వదలరు.

Telangana: ఈ కిలాడీ లేడీలు మహా ముదురు..! టార్గెట్ ఫిక్స్ చేస్తే.. అంతే సంగతులు!
Lady Thieves
Follow us on

బంగారం వ్యాపారులే టార్గెట్‌. మాటల్లోకి దించి.. నమ్మించి.. చివరికి దోచుకోవడం ఆ మాయలేడీలకు వెన్నతో పెట్టిన విద్య. చీటింగ్‌ చేయడం, విలాసవంతంగా బతకడం.. అదే వాళ్ల టార్గెట్‌. ఈ కిలాడీ లేడీలు టార్గెట్ ఫిక్స్ చేస్తే, చోరీ చేసిందాకా వదలరు. అందినకాడికి దండుకుని మెల్లగా జారుకుంటారు. చివరికి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఎట్టకేలకు మహిళా దొంగ ముఠాను పట్టుకుని కటకటాల వెనక్కు నెట్టారు.

గోల్డ్ షాపులే టార్గెట్ గా రెచ్చిపోతున్న కిలాడీ లేడీలను మంచిర్యాల‌ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న మహిళా అంతర్ రాష్ట్ర ముఠాను మంచిర్యాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ బన్సిలాల్ వివరాలను వెల్లడించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు మాసు అన్నపూర్ణ, రాధా, శనిగారం పూలమ్మతో కూడిన అంతర్ జిల్లాల నగల చోరీ ముఠాను మంచిర్యాలలో పట్టుకున్నామని సీఐ బన్సిలాల్ తెలిపారు. ఈ ముఠా బంగారు షాపులకు వెళ్లి బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ జువెలరీ షాపుల యజమానుల నమ్మిస్తారు. వారి దృష్టి మరల్చి విలువైన వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇలా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పతున్నారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, వరంగల్ లోని మట్టేవాడ, జమ్మికుంటలో జువెలరీ షాపులే టార్గెట్‌గా చేసుకుని ఆభరణాల దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు.

ఈ క్రమంలోనే గత ఐదు రోజుల క్రితం మంచిర్యాల పట్టణంలోని శ్రీ వైష్ణవి జువెలర్స్ షాప్ లో దొంగతనానికి పాల్పడడంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ముఠా దొంగిలించిన విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు సీఐ బన్సిలాల్. వారి నుంచి అర కిలో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. గుర్తు తెలియని మహిళల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాపారులకు పోలీసులు సూచిస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..