TG Weather: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్..

|

Aug 14, 2024 | 12:34 PM

తెలంగాణలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం నాటి ద్రోణి రాయలసీమ కొమొరిన్‌ ప్రాంతం వరకు విస్తరించి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వెల్లడించింది.

TG Weather: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్..
Andhra and Telangana Weather
Follow us on

సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. కాగా నగరంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది. ఆగస్టు 17 వరకు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని.. ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

ముందస్తు వర్షాల దృష్ట్యా ఐఎండీ ఎల్లో అలర్ట్

భారీ వర్ష సూచన నేపథ్యంలో ఐఎండీ  హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, హన్మకొండ, ములుగు,  మల్కాజిగిరి, జనగాం, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 13, మంగళవారం అత్యధికంగా మహబూబాబాద్‌లో 93.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా మారేడ్‌పల్లిలో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

IMD హైదరాబాద్ రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షసూచన చేసిన నేపథ్యంలో.. సిటీతో పాటు జిల్లాల్లో మొత్తం వర్షపాతం స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.