డీజీపీ చేతిలో మోస్ట్ వాంటెడ్ ‘సెవెన్’.. వారితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?

మార్చి 7న మొత్తం 4 బస్సుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చి, 124 ఆయుధాలను పోలీసుల చేతికి ఇచ్చి, ఏకంగా 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు.. శనివారం నాటి చరిత్రాత్మక సందర్భం అది. కానీ, ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరు కాదు ఏడుగురు కావాలి అని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా ఏడుగురు? ఎక్కడున్నట్టు? ఆ ఏడుగురితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?

డీజీపీ చేతిలో మోస్ట్ వాంటెడ్ సెవెన్.. వారితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?
Amit Shah, Revanth Reddy, Ganapathi

Edited By:

Updated on: Mar 08, 2026 | 8:09 PM

శనివారం (మార్చి 07) మొత్తం 4 బస్సుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు వచ్చి, 124 ఆయుధాలను పోలీసుల చేతికి ఇచ్చి, ఏకంగా 130 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటు.. శనివారం నాటి చరిత్రాత్మక సందర్భం అది. కానీ, ఒక్కటి మిగిలింది అంటోంది తెలంగాణ సర్కార్. ఒక్కరు కాదు ఏడుగురు కావాలి అని ఆర్డర్ వేసింది కేంద్ర హోంశాఖ. ఎవరా ఏడుగురు? ఎక్కడున్నట్టు? ఆ ఏడుగురితోనే కామ్రేడ్ల శకానికి క్లయిమాక్స్ ముడిపడి ఉందా?

మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు లొంగిపోతే రెడ్‌కార్పెట్ వేస్తామంటోంది తెలంగాణ సర్కార్. మీ ఆరోగ్య, ఆర్థిక, సామాజిక భద్రతకు మాదీ భరోసా అని ధీమా కల్పిస్తోంది. ఇటీవలే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్.. నక్సలిజం అంతానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించారు. లొంగుబాటు ప్యాకేజ్‌ని, రివార్డుల మొత్తాన్ని పెంచే ప్రయత్నం చేశారు. దాని ఫలితమే శనివారం జరిగిన భారీ లొంగుబాటు.

ఇటీవల లొంగిపోయిన కీలక నేత దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి గ్రూపులకు చెందిన PLGA కమిటీ మొత్తం సరెండర్‌ అయింది. కానీ, లొంగిపోవాల్సిన ఆ ఏడుగురు మాత్రం ఇప్పటికీ పోలీసులతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? బయట రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఏడుగురు మావోయిస్టులపై సెర్చ్ లైట్ పడింది. ఈ హిట్‌ లిస్టులో టాపర్ ఎవరంటే, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి.. ఈయన మావోయిస్ట్ పార్టీ మాజీ చీఫ్… సొంతూరు జగిత్యాల జిల్లా బీర్పూర్. హనుమకొండ జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ సంతోష్, గద్వాల జిల్లా బుధవారపు పేటకు చెందిన కేంద్ర కమిటీ సభ్యురాలు గణపతి భార్య సోమిడి జోడే రత్నాబాయి, సికింద్రాబాద్‌కి చెందిన DKSDC కమ్యూనికేషన్ విభాగం ఇన్‌ఛార్జ్‌ వార్త శేఖర్, హైదరాబాద్‌కి చెందిన నక్క సుశీల అలియాస్ రేల, సిద్దిపేట జిల్లా మిర్‌దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య, భదాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్.. ఈ ఏడుగురే ఇప్పుడే పోలీసుల మోస్ట్‌ వాంటెడ్.

లొంగిపోవాలని ముఖ్యమంత్రే నేరుగా కోరడంతో ఫస్ట్ ఫోకస్ గణపతి మీదే పడింది. ఆయన లొంగుబాటు ప్రక్రియ స్పీడందుకుంది. గణపతి టచ్‌లో కొచ్చారు కానీ, లొంగిపోలేదని కన్‌ఫమ్ చేశారు తెలంగాణ పోలీసులు. 40 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో కీలకంగా ఉంటూ, పాతికేళ్లు చీఫ్‌గా చేసి, ఆరురాష్ట్రాల క్యాడర్‌తో సుపరిచితులైన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావు.. ఇప్పుడు ఎక్కడున్నట్టు?

ఇటీవలే లొంగిపోయిన దేవ్‌జీ లాంటి అగ్రనేతల ఇచ్చిన సమాచారంతో గణపతి నేపాల్ లేదా ఫిలిప్పైన్స్‌లో ఉన్నట్టు ఓ క్లారిటీకి వచ్చింది తెలంగాణ SIB. అటు, గణపతి కుమారుడి ఆడియో, కుటుంబీకుల విజ్ఞప్తులను కూడా పరిశీలిస్తున్నారు. స్కెచ్ పక్కాగా అమలైతే మరో వారం రోజుల్లో గణపతిని హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ, ముఖ్యమంత్రి ఎదుట హాజరు పరుస్తారా, మార్చి 31 ఆపరేషన్ కగార్‌కి ఆఖరితేదీ సందర్భంగా కేంద్ర హోంశాఖకు అప్పగిస్తారా.. అనేదే సస్పెన్స్.

ఏదైతేనేం గణపతిని రౌండప్ చేసి, మిగతా వాళ్లను క్యూలో నిలబెట్టేసినట్టే తెలుస్తోంది. తెలంగాణలోనే పుట్టి ఎదిగిన మావోయిస్టు పార్టీకి తెలంగాణలోనే క్లయిమాక్స్ ఇవ్వాలన్నది డీజీపీ ఐడియా. ఈ గణపతితో పాటు ఆ ఏడుగురూ లొంగిపోతే దేశంలోకెల్లా మొట్టమొదటి మావోయిస్టు రహితరాష్ట్రంగా మారనుంచి తెలంగాణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us