HYDRA Action: ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్.. కాకపోతేః రంగనాథ్

|

Aug 27, 2024 | 7:53 PM

హైడ్రా.. ఈ పేరు ఇప్పుడు ఒక్క హైదరాబాదే కాదు.. తెలంగాణ అంతటా మార్మోగుతోంది. చెరువుల రక్షణకు హైడ్రా చేస్తున్న చర్యలు చూసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడ విన్నా.. ఇదే పేరు వినిపిస్తోంది.

HYDRA Action: ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్.. కాకపోతేః రంగనాథ్
Hydra Commissioner Ranganath
Follow us on

హైడ్రా.. ఈ పేరు ఇప్పుడు ఒక్క హైదరాబాదే కాదు.. తెలంగాణ అంతటా మార్మోగుతోంది. చెరువుల రక్షణకు హైడ్రా చేస్తున్న చర్యలు చూసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడ విన్నా.. ఇదే పేరు వినిపిస్తోంది. వచ్చి రాగానే.. హైడ్రా దూకుడు ఆ విధంగా ఉంది మరి. అక్రమం అని ఎక్కడ కనిపించినా.. వినిపించినా ఉక్కుపాదం మోపుతోంది. తన, పర బేదం లేకుండా దూకుడుగా వెళ్తోంది.

సలకం చెరువులో నిర్మించిన ఓవైసీ విద్యాసంస్థలపై చర్యలుండవా అంటూ నాలుగైదు రోజులుగా బీజేపీ హైడ్రాను ప్రశ్నిస్తోంది. అయితే కూల్చమని, ఓవైసీ తప్పుచేయలేదని ఎక్కడా రంగనాథ్ చెప్పలేదు. కేవలం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సమయం ఇస్తామని మాత్రమే చెప్పారు. ఆసక్తికర విషయం ఏంటంటే ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా ఒకటే రూల్ అంటూ ఇంకో పేరు కూడా జత చేశారు.

హైడ్రా కూల్చివేతలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. పెద్దోళ్ల అక్రమ నిర్మాణాలు కూలిస్తే ఒకే కానీ.. పేద వారిపైనే మీ ప్రతాపమా అని ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. అయితే ఎవరెంత ఒత్తిడి తెచ్చినా.. చెరువులను పరిరక్షించే విషయంలో తగ్గేదేలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినవాళ్లు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని.. ఏ పార్టీకి సంబంధించిన వారు ఉన్నా వదిలేది లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

ఇన్నాళ్లూ హైడ్రా యాక్షన్‌ పై అటు , బీఆర్ఎస్‌ ఇటు బీజేపీ విమర్శలతో సాగిన రాజకీయాలు రెండు రోజులు నుంచి ఎంఐఎం వైపు మళ్లాయి. తాజాగా హైడ్రా భుజంపై తుపాకీ పెట్టి ఎంఐఎంను టార్గెట్ చేసింది బీజేపీ. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్ న్యూసిటీకే పరిమితమా అని ప్రశ్నిస్తోంది..? సీఎం రేవంత్ రెడ్డికి పాతబస్తీ చెరువుల కబ్జాలు తొలగించాలంటూ బీజేపీ నేతలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన అక్రమ కట్టడాల కూల్చివేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చెరువులను, ప్రభుత్వ స్థలాలను అక్రమించి నిర్మాణం చేసినట్లు తేలితే, అదీ ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్ అని రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం విద్యా సంవత్సరం కొనసాగుతుందని, విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నామన్నారు. అకడమిక్ ఇయర్‌ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారని రంగనాథ్ తెలిపారు. అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు వాళ్లకు సమయం ఇస్తున్నామని, ఈలోపు వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుందని రంగనాథ్ హెచ్చరించారు.

ఇదిలావుంటే, అక్రమార్కులకు సింహస్వప్నంలా ఉన్న హైడ్రా..ఇకముందు ఎలాంటి టర్న్ తీసుకోనుంది. ఇప్పటిదాకా జరిగింది జస్ట్ ట్రైలర్ పార్టేనని ప్రభుత్వం చెబుతోంది. మరి మున్ముందు ఎలాంటి సినిమా హైడ్రా చూపించబోతోంది. స్వపక్షమైనా.. విపక్షమైనా తప్పు జరిగితే తప్పించడమే అంటున్న రేవంత్‌ సర్కార్.. నెక్స్ట్ టార్గెట్ ఎలా ఉండబోతోంది..? అన్నదీ తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషనల్‌గా మారింది.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..