Hyderabad: హైదరాబాద్ మరో బెంగళూరు కానుందా..? ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం ఇదే

కోట్లు కుమ్మరించి విలాసవంతమైన ఫ్లాట్లు కొంటున్నారు.. కానీ ఉదయం లేస్తే గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ల వైపు దీనంగా చూస్తున్నారు. ఆకాశాన్ని తాకే గేటెడ్ కమ్యూనిటీలు, గ్లాస్ బిల్డింగులతో ప్రపంచ పటంలో మెరిసిపోతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇప్పుడు వింత సంక్షోభం మొదలైంది. ఒకప్పుడు ఇల్లు కొనాలంటే రోడ్లు, మెట్రో, స్కూళ్లు ఉన్నాయా అని చూసేవారు.. కానీ ఇప్పుడు రోజూ తాగడానికి నీళ్లు వస్తాయా? అని భయపడుతూ అడగాల్సిన దుస్థితి. పశ్చిమ హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న నీటి కష్టాల అసలు కథేంటో తెలుసుకుందాం..

Hyderabad: హైదరాబాద్ మరో బెంగళూరు కానుందా..? ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం ఇదే
Hyderabad Water Crisis

Edited By:

Updated on: Nov 10, 2026 | 9:50 PM

కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్లు కొంటున్నారు. గుక్కెడు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. బోర్లు ఎండిపోతున్నాయి. ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే రోడ్డు ఉందా, స్కూలు ఉందా, ఐటీ కంపెనీ ఎంత దూరంలో ఉందని చూసేవారు. ఇప్పుడు మరో ప్రశ్న కూడా అడగాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ అపార్ట్‌మెంట్‌కు నీళ్లు వస్తాయా. కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నా రోజూ గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ వైపు చూడాల్సి వస్తే ఆ ఇంటి విలువ ఎంత. ఎత్తైన భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి. కానీ వాటికి అవసరమైన నీటి వనరులు మాత్రం పెరగడం లేదు. ఒకవైపు బోర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు ట్యాంకర్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నిన్నటివరకు ఐటీ ఉద్యోగాలకు చిరునామాగా ఉన్న పశ్చిమ హైదరాబాద్. ఇప్పుడు నీటి కష్టాలకు కేంద్రంగా మారుతోందా. రేపు ఇదే పరిస్థితి నగరమంతా విస్తరిస్తే హైదరాబాద్ బతుకులు ఎలా ఉంటాయి. ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నల్లగండ్ల, నానక్‌రామ్‌గూడ, మణికొండ, తెల్లాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నీటి అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హాస్టళ్లు, పీజీలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ వినియోగం పెరిగింది. కొన్ని గేటెడ్...

Loading...
Unable to load recommendations.
Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి