Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..

దీన్ని పిచ్చి అంటామా.. వెర్రి అంటామా.. ఇంకేమైన అంటామా.. రోడ్డుపై వెళ్లాల్సిన కారు రైల్వే ట్రాక్‌పై వెళ్తుందా?.. ఓ యువతి అలాంటి అరాచకానికే పాల్పడింది.. రైలు పట్టాలపై కారును హైస్పీడ్ తో నడుపుతూ హల్‌చల్ చేసింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఆలస్యమైంది..సరిగ్గా టైమ్‌కి చూశారు కాబట్టి సరిపోయింది కాని.. లేదంటే ప్రమాద తీవ్రత ఊహించడానికే భయంగా ఉంది.

Viral Video: రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. వామ్మో ఎదురుగానే ట్రైన్.. అంతలోనే..
Shankarpalli Car Incident

Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 26, 2025 | 11:39 AM

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి హల్‌చల్ చేసింది. కారును ఏకంగా రైలు పట్టాలపై నడిపింది.. నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేసింది.. దీంతో రైళ్లను సైతం ఆపివేశారు. నాగులపల్లిలో యువతి కారును గమనించిన స్థానికులు అడ్డగించారు. సరిగ్గా ఇదే సమయంలో పట్టాలపై కారును గమనించిన లోకోపైలట్ రైలును ఆపేశారు.. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్లు గంటలతరబడి నిలిచిపోయాయి.

అయితే.. యువతి మాత్రం స్పీడ్ గా ట్రాక్‌పై దూసుకెళ్లింది.. స్థానికులు ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా కారుతో యువతి కారును అలానే నడిపింది. అనంతరం కారు ఆగిపోవడంతో స్థానికులు యువతిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. తాము అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా యువతి మౌనంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ యువతిని చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన రబిక సోనీగా గుర్తించారు.

వీడియో చూడండి..

శంకర్‌పల్లి పోలీసులు యువతి వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించనున్నారు. అయితే, ఆమె మద్యం లేదా డ్రగ్స్ తీసుకుందా ..? లేదా..? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.. ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతుండొచ్చని పేర్కొంటున్నారు. యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..