Hyderabad: ఎంత పనిచేశావ్ కిరణ్మయి.. లవర్ రీఛార్జ్ చేయలేదని ఏం చేసిందంటే..

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రియుడు ఫోన్ రీఛార్జ్ చేయలేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సహజీవనంలో ఉన్న కిరణ్మయి తన పార్టనర్ చందు రీఛార్జ్ చేయకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్న సమస్యలకే జీవితాలను నాశనం చేసుకుంటున్న తీరు ఆందోళనకరంగా మారింది.

Hyderabad: ఎంత పనిచేశావ్ కిరణ్మయి.. లవర్ రీఛార్జ్ చేయలేదని ఏం చేసిందంటే..
Hyderabad Crime News

Updated on: May 02, 2026 | 10:09 AM

కొందరు క్షణికావేశంలో దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. చిన్న చిన్న విషయాలకే జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.. ప్రాణాలు తీసుకుంటూ.. కుటుంబాలకు తీరని శోకం మిగుల్చుతున్నారు. తాజాగా.. ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. తన లవర్ ఫోన్‌ రీఛార్జ్‌ చేయించలేదని ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన హైదరాబాద్‌ నగరంలోని జీడిమెట్లలో కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌ ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటోన్న కిరణ్మయి(26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. కిరణ్మయి 2015లో ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. వారికి ఓ కుమారుడు ఉండగా.. అతను కిరణ్మయి తల్లి (అమ్మమ్మ) వద్ద ఉంటున్నాడు.

అయితే.. కిరణ్మయి నాలుగేళ్ల క్రితం కూకట్‌పల్లిలో బ్యూటీషియన్‌ కోర్సు నేర్చుకొని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే.. కిరణ్మయికి ప్రైవేటు ఉద్యోగం చేసే వెంకటేశ్‌ ఎలియాస్‌ చందు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త.. ప్రేమగా మారింది.. దీంతో చందు కిరణ్మయి ఏడాది నుంచి వారు ప్రశాంత్‌నగర్‌లో ఉంటూ సహజీవనం చేస్తున్నారు.

అయితే.. రెండు రోజుల క్రితం కిరణ్మయి మొబైల్ రీఛార్జ్‌ అయిపోయింది. జీతం ఇంకా రాకపోవడంతో రీఛార్జ్‌ చేయించుకోలేకపోయింది. చందును రీఛార్జ్ చేయాలని కోరగా అతను చేయలేదు.. చందు కూడా రీఛార్జ్‌ చేయించలేదని బాధపడింది.. ఇదే విషయంలో శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

దీంతో మనస్తాపం చెందిన కిరణ్మయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతురాలి తల్లి చందుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేణుక ఏడాదిన్నరలో ముగ్గురిని మార్చింది.. పైగా ప్రైవేట్ వీడియోలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న భర్త లెటర్..

Follow Us