హమ్మయ్య.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోని మరిన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌తో పాటు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

హమ్మయ్య.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Rain Alert

Updated on: Jun 06, 2026 | 3:21 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. భానుడి ఉగ్రరూపంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.. ఈ క్రమంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాలు, వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నైరుతి రుతుపవనాలు ఏపీకి తాకినట్లు పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఈ రోజు, జూన్ 6, 2026న, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భాగాలు, తమిళనాడులోని చాలా ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతం మొత్తం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, మిజోరం, మణిపూర్‌లోకి మరింతగా ముందుకు సాగాయి. ఈరోజు అనగా జూన్ 6 తేదీ ,2026 నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 17 .5° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 17 .5 ° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 17 ° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, దేవ్‌గడ్, కొప్పల్, అనంతపురము, చెన్నై, 15 .5° ఉత్తర అక్షాంశం /85° తూర్పు రేఖాంశం, 20° ఉత్తర అక్షాంశం /89 .5° తూర్పు రేఖాంశం, ఐజ్వాల్, 25° ఉత్తర అక్షాంశం /95° తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది.

రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ – యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

శనివారం, ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఆదివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక ;- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులేకుండానే కొంచెం తగ్గే అవకాశముంది.

రాబోయే 2-3 రోజుల్లో తెలంగాణలోకి..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ-మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

శనివారం, ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుండి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings): ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Follow Us