తెలంగాణలో బస్సులు నడిపేది అప్పుడే.. మంత్రి క్లారిటీ..!

| Edited By: Pardhasaradhi Peri

May 14, 2020 | 7:31 PM

తెలంగాణలోని అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చిన తరువాతే ఆర్టీసీ సేవల ప్రారంభంపై ఆలోచిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం తరువాతనే ఆర్టీసీ బస్సులు నడపడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించిన పువ్వాడ ఈ మేరకు తెలంగాణలో బస్సులు నడపడంపై వివరణ ఇచ్చారు. ఇక కార్గో సేవలను వ్యవసాయం, మార్క్‌ఫెడ్‌లకు అనుసంధానం చేశామని, మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల […]

తెలంగాణలో బస్సులు నడిపేది అప్పుడే.. మంత్రి క్లారిటీ..!
Follow us on

తెలంగాణలోని అన్ని జిల్లాలు గ్రీన్‌జోన్‌లోకి వచ్చిన తరువాతే ఆర్టీసీ సేవల ప్రారంభంపై ఆలోచిస్తామని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం తరువాతనే ఆర్టీసీ బస్సులు నడపడంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా అల్లిపురం కొనుగోలు కేంద్రంలో ఆర్టీసీ కార్గో సేవలను ప్రారంభించిన పువ్వాడ ఈ మేరకు తెలంగాణలో బస్సులు నడపడంపై వివరణ ఇచ్చారు. ఇక కార్గో సేవలను వ్యవసాయం, మార్క్‌ఫెడ్‌లకు అనుసంధానం చేశామని, మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల నుంచి కార్గో ద్వారా మార్క్‌ఫెడ్‌ గోదాంలకు తరలిస్తున్నామని వివరించారు. కాగా మరోవైపు శుక్రవారం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్ పొడిగింపు వంటి కీలకాంశాలపై ఆయన శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షలో చర్చించనున్నారు.

Read This Story Also: ఓటీటీలో రిలీజవుతోన్న అమితాబ్ సినిమా.. డేట్ కూడా వచ్చేసింది..!