అక్రమంగా మద్యం రవాణా.. హోంగార్డు, కానిస్టేబుల్ అరెస్ట్‌..!

| Edited By:

Apr 20, 2020 | 6:48 AM

లాక్‌డౌన్ వేళ అక్రమంగా మద్యం తరలిస్తోన్న హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది

అక్రమంగా మద్యం రవాణా.. హోంగార్డు, కానిస్టేబుల్ అరెస్ట్‌..!
Follow us on

లాక్‌డౌన్ వేళ అక్రమంగా మద్యం తరలిస్తోన్న హోంగార్డును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా నమ్మికల్ గ్రామానికి చెందిన అనిల్‌ కుమార్ మలక్‌పేట ట్రాఫిక్‌ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. స్వగ్రామం నుంచి 36 మద్యం సీసాలతో అతడు ఆదివారం సైదాబాద్‌కు బయలుదేరాడు. విశ్వసనీయ సమాచారంతో వనస్థలిపురం పనామా వద్ద కారులో తనిఖీ పోలీసులు అతడి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డును రిమాండ్‌కు తరలించారు.

మరోచోట మద్యం తరలిస్తున్న కానిస్టేబుల్‌ను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న విజయ్‌ సొంతూరి నుంచి వచ్చే సమయంలో 23 మద్యం సీసాలను తీసుకొని హైదరాబాద్‌కు బయల్దేరాడు. పనామా వద్ద తనిఖీ చేసిన పోలీసులు.. కానిస్టేబుల్ వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించారు.

Read This Story Also: పూరీ దగ్గర అసిస్టెంట్‌గా చేరాలనుకున్న జక్కన్న.. ఎందుకంటే..!