ప్రయాణికులకు సూచన.. రాజీవ్ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు..!

| Edited By:

May 30, 2020 | 2:08 PM

రాజీవ్ రహదారిపై టోల్‌గేట్ ఫీజులు పెరిగాయి. ఈ ఫీజులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి,

ప్రయాణికులకు సూచన.. రాజీవ్ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు..!
Follow us on

రాజీవ్ రహదారిపై టోల్‌గేట్ ఫీజులు పెరిగాయి. ఈ ఫీజులు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, సిద్దిపేట, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లే వారిపై ఫీజుల భారం పడనుంది. కొత్త ఫీజుల ప్రకారం.. కారు సింగిల్ ట్రిప్‌కు రూ.58 తీసుకోనున్నారు. అలాగే ఒక రోజు పాస్‌కి రూ.87, నెల పాస్‌ రూ.1,740 వసూలు చేయనున్నారు. ఇక ఎల్సీపీ/మినీ బస్సులకు.. సింగిల్‌ ట్రిప్‌కి రూ.117, ఒక రోజు పాస్‌కి రూ.175, నెల పాస్‌కి రూ.3,510 వసూలు చేయబోతున్నారు. ఇక బస్సు/ట్రక్కుకి సింగిల్ ట్రిక్‌కి రూ.233, ఒక రోజు పాస్‌కి రూ.349, నెల పాస్‌కి రూ.6,990 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎంఏవీల విషయంలో సింగిల్ ట్రిప్‌కి రూ.583, ఒక రోజు పాస్‌కి రూ.874, నెల పాస్‌కి రూ.17,490 వసూల్ చేయబోతున్నారు.

Read This Story Also: మూడు నెలల తరువాత భారత్‌కి రానున్న చెస్‌ లెజండ్..!