‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’‌పై తెలంగాణ దృష్టి

| Edited By:

Aug 14, 2020 | 8:42 AM

రాష్ట్రంలోని వివిధ సేవలకు గానూ సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్తిమ మేథస్సు)

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తెలంగాణ దృష్టి
Follow us on

Telangana Artificial Intelligence: రాష్ట్రంలోని వివిధ సేవలకు గానూ సాంకేతిక పరిఙ్ఞానాన్ని ఉపయోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(కృత్తిమ మేథస్సు)‌, బ్లాక్ చెయిన్‌, మెషీన్ లెర్నింగ్‌, డ్రోన్‌, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆ డొమైన్‌లో అగ్రస్థానం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. కృత్తిమ మేథస్సు రంగంలో 200 ఆవిష్కర్తలు, స్టార్టప్‌లను ఆకర్షించడంతోపాటు భవిష్యత్తులో రూ. 2 లక్షల కోట్ల పరిశ్రమగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరాన్ని ‘ఇయర్‌ ఆఫ్‌ ది ఏఐ’గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆరు అంచెల వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఈ క్రమంలో వివిధ రంగాలకు చెందిన సంస్థలతో ఏఐ పరిశోధన, ఆవిష్కరణల కోసం రాష్ట్ర ఐటీశాఖ భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ఈ ఒప్పందంలో భాగంగా పలు సంస్థలు రాష్ట్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. దీనిపై మాట్లాడిన మంత్రి కేటీఆర్‌.. సీ4ఐఆర్‌, ప్రపంచ ఆర్థిక వేదికలతో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా రైతులకు, విధాన రూపకర్తలకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపడతామని అన్నారు. సాంకేతిక పరిఙ్ఞానం సామాన్యులకు ఉపయోగపడాలన్నది కేసీఆర్ సంకల్పమని, దీనికి అనుగుణంగానే పేదల జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.

Read More:

కరోనా మూలాలు.. గబ్బిలాల కోసం థాయిలాండ్‌ శాస్త్రవేత్తల అన్వేషణ

‘జాంబీ రెడ్డి’ టైటిల్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు