‘జాంబీ రెడ్డి’ టైటిల్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

'అ!', 'కల్కి' వంటి భిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, మూడో చిత్రంగా 'జాంబీ రెడ్డి'ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

'జాంబీ రెడ్డి' టైటిల్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 7:18 AM

Zombie Reddy title controversy: ‘అ!’, ‘కల్కి’ వంటి భిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ, మూడో చిత్రంగా ‘జాంబీ రెడ్డి’ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్‌ నిర్మిస్తోన్న ఈ మూవీ టైటిల్‌ టీజర్‌ని కూడా ఇటీవల విడుదలైంది. అయితే ఈ మూవీ టైటిల్‌పై వివాదం మొదలైంది. ఓ వర్గం వారు ఈ టైటిల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

ఓ ప్రకటనను విడుదల చేసిన వర్మ.. ”ఏ వర్గాన్ని కించపరచాలన్న ఉద్దేశ్యం మాకు లేదు. కర్నూల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఓ మహమ్మారిపై ఈ సినిమాను తెరకెక్కస్తున్నాం. అక్కడి ప్రజలు ఈ మహమ్మారిపై ఎలా విజయం సాధించారు అన్న కథనంలో ఈ మూవీ ఉండబోతోంది. హాలీవుడ్‌ సినిమాల్లో న్యూయార్క్‌ బ్యాక్‌డ్రాప్‌ను ఎలా తీసుకుంటారో, నేను కర్నూల్‌ని తీసుకున్నా. టైటిల్‌ని చూసి అపార్థం చేసుకోకండి. ఇందులో ఏ వర్గాన్ని మేము కించపరచవు. నా మొదటి చిత్రం అ! జాతీయంగా గుర్తింపును సాధించింది. జాంబీ రెడ్డి కూడా అలానే గుర్తింపు సాధిస్తుందని నమ్ముతున్నా” అని వెల్లడించారు.

Read More:

‘వాల్వ్’‌ లేని ‘ఎన్‌-95’ మాస్క్‌లే ఉత్తమమైనవి

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!