Minister KTR: ఓఆర్ఆర్ పరిధిలో ఇక నీటి కష్టాలుండవు.. మహేశ్వరంలో రూ.200 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన

|

Jan 29, 2022 | 6:38 PM

Minister KTR: హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఇక నీటి కష్టాలు ఉండవని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. నగరంలో

Minister KTR: ఓఆర్ఆర్ పరిధిలో ఇక నీటి కష్టాలుండవు.. మహేశ్వరంలో రూ.200 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన
Ktr
Follow us on

Minister KTR: హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఇక నీటి కష్టాలు ఉండవని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. నగరంలో తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని కేటీఆర్ (KTR) అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని జీహెచ్ఎంసీ (GHMC) బయట ఉన్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు తాగునీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్లతో చేపడుతున్న పనులను మున్సిపల్ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. శనివారం తుక్కుగూడ, జల్పల్లి, మీర్పేట్, బడంగ్పేట్లో వివిధ అభివృద్ధి పనులను, జలమండలి చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కృష్ణా, గోదావరి నీటిని నగరానికి తెచ్చి మహిళల నీటి కష్టాలను కేసీఆర్ ప్రభుత్వం దూరం చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ఓఆర్ఆర్ వరకు విస్తరించినందున ఈ ప్రాంతంలో కూడా తాగునీటి సమస్యలు తీర్చేందుకు సుమారు రూ.700 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్ – 1 పూర్తి చేశామని, ఇప్పుడు మరో రూ.1,200 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్ -2 పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్క మహేశ్వరం నియోజకవర్గానికే సుమారు రూ.200 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గతంలో కోటి రూపాయల నిధులు విడుదల అయితే గొప్ప విషయంగా ఉండేదని, కానీ, ఇప్పుడు ఒక్క రోజే మహేశ్వరం నియోజకవర్గంలో రూ.371 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజీత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, యొగ్గె మల్లేషం, జలమండలి ఎండీ దానకిశోర్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్ డైరెక్టర్-2 స్వామి, జెడ్పీ చైర్‌పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:

తెలుగు వాళ్లు నష్టపోతున్నారు.. రైల్వే రిక్రూట్‌మెంట్ విధానంలో ప్రక్షాళన చేయాలి.. కేంద్రమంత్రికి వినోద్ కుమార్ లేఖ

IIT Kharagpur Jobs: బీటెక్‌/ఎంటెక్‌ అర్హతతో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో వివిధ ఉద్యోగావకాశాలు.. పూర్తి వివరాలివే!