రేవంత్ రెడ్డి డొల్ల కంపెనీలు.. దిమ్మతిరిగే వాస్తవాలు..!

| Edited By:

Mar 14, 2020 | 8:36 PM

భూ కబ్జాలు, రాజకీయ కుట్రలు, ఫోర్జరీ కేసులు. వీటన్నిటికీ కేరాఫ్‌ అయిన రేవంత్‌రెడ్డి కున్న మరో కోణం మనీలాండరింగ్‌. దొంగ సొత్తు తెచ్చుకునేందుకే కంపెనీలు పెట్టడం.. రేవంత్‌ కుటుంబ సభ్యులే వాటికి డైరెక్టర్లుగా ఉండటం చూస్తుంటే రేవంత్‌పై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.

రేవంత్ రెడ్డి డొల్ల కంపెనీలు.. దిమ్మతిరిగే వాస్తవాలు..!
Follow us on

భూ కబ్జాలు, రాజకీయ కుట్రలు, ఫోర్జరీ కేసులు. వీటన్నిటికీ కేరాఫ్‌ అయిన రేవంత్‌రెడ్డి కున్న మరో కోణం మనీలాండరింగ్‌. దొంగ సొత్తు తెచ్చుకునేందుకే కంపెనీలు పెట్టడం.. రేవంత్‌ కుటుంబ సభ్యులే వాటికి డైరెక్టర్లుగా ఉండటం చూస్తుంటే రేవంత్‌పై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. టాటాలు, అంబానీలే చిన్నబోయే విధంగా రేవంత్‌ రకరకాల రంగాల్లో 29 కంపెనీలు పెట్టారు. ఈ కంపెనీల మూలాలు తవ్వితే దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడబోతున్నాయి.

షెల్‌ కంపెనీలు పెట్టడం, కొంతకాలానికి రద్దు చేయడం. ఇదీ రేవంత్‌కు బాగా అలవాటైంది. షెల్‌ కంపెనీలు పెట్టి ఎవరూ దేశాన్ని ఉద్ధరించరు. మనీలాండరింగ్‌ కోసమే వాడుకుంటారు. ఒకే అడ్రస్‌తో ఇన్ని కంపెనీలు కాగితాల మీద స్థాపించిన రేవంత్‌ రెడ్డి ఉద్దేశం ఏంటి? నిజంగా వ్యాపారమేనా..? లేక మనీలాండరింగా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై గొంతు చించుకునే ఈ సోకాల్డ్‌ ప్రజాప్రతినిధి- తన మీద వస్తున్న ఈ ఆరోపణలకు సమాధానాలు ఎందుకు చెప్పడం లేదన్నదే అసలు కథ.

మనదేశంలో గత కొన్నేళ్లుగా బయటపడుతున్న ఆర్థిక నేరాల్లో జనానికి బాగా వినిపించిన పేరు షెల్‌ కంపెనీ. దీన్నే డబ్బా కంపెనీ అంటారు. అంటే చేసే వ్యాపారం ఉండదు. కానీ బిల్స్‌ మాత్రం సృష్టిస్తారు. ఉత్తుత్తి బిజినెస్‌ను నిజంగా జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో పెద్దఎత్తున డబ్బు తారుమారు అవుతుంది. రెండు డజన్లకుపైగా కంపెనీలకు రేవంత్‌ రెడ్డి ఇల్లే చిరునామా కావడంపై కూడా జనానికి డౌట్లు వస్తున్నాయి.

ఒకే చిరునామాతో కాగితాలపై కంపెనీలు పెట్టడం ఒక ఎత్తయితే, నెలకొల్పిన కంపెనీల్లో 17 కంపెనీలను రద్దు చేయడం మరో ఎత్తు. ఈ కంపెనీలన్నిటికీ సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించారా? జీఎస్టీ చెల్లిస్తున్నారా? నిబంధనల ప్రకారం రిటర్న్స్‌ ఫైల్‌ చేశారా? అన్న అంశాలపై లోతైన దర్యాప్తు జరిగితే తప్ప అసలు సంగతి బయటకు రాదు. కంపెనీల పేరు మీద విదేశాల నుంచి లావాదేవీలు సాగుతున్నాయా? వాటిలో నిజానిజాలేంటి అన్నదానిపై కూడా క్రమంగా ఫోకస్‌ పెరుగుతోంది.

ఒకటో రెండో వ్యాపారాలు చేస్తుండొచ్చుగానీ.. సుమారు డజను రంగాల్లో రేవంత్‌ కుటుంబానికి నిజంగా కార్యకలాపాలు ఉన్నాయా అన్న సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీల వెనక అసలు కథ ఏంటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులే 29 కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉంటడం వెనక మతలబు ఏంటన్నది బయటకు రావల్సి ఉంది. ఒక కంపెనీలో ఉన్నవారే ఇంకో కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటారు. ఇన్ని కంపెనీల్లో డైరెక్టర్‌గా లేని రేవంత్‌రెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చిన వివరాలు సందేహాస్పదంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2009, 2014 ఎన్నికలకు ముందు రేవంత్‌ సమర్పించిన అఫిడవిట్లలో- తనకు 17 కంపెనీల్లో షేర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ 2018 ఎన్నికలనాటి అఫిడవిట్లో ఆ షేర్లు ఏంటో, ఆ షేర్ల విలువ ఏంటో ప్రస్తావించలేదని అంటున్నారు. అసలు రేవంత్‌ అండ్‌ కో.. ఒక కంపెనీని నెలకొల్పడం, దాన్ని 10 ఏళ్లలో రద్దు చేయడం వెనక లాజిక్‌ ఏంటన్నది సగటు మనిషికి అర్థం కాని అంశం.

Read This Story Also: తల్లిని కలిసిన అమృత