Telangana: మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్.. ఆసక్తిగా మారనున్న చర్చ..

|

Nov 10, 2022 | 3:53 PM

తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. రేపు (శుక్రవారం) కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఈ రోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో...

Telangana: మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ అపాయింట్మెంట్.. ఆసక్తిగా మారనున్న చర్చ..
Sabitha Indra Reddy
Follow us on

తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. రేపు (శుక్రవారం) కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. గవర్నర్ ఈ రోజు సిద్దిపేట జిల్లా పర్యటనలో ఉన్నారు. యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై మంత్రి చర్చించనున్నారు. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, అపాయింట్ మెంట్ ఇస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు గురించి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ఉన్న సందేహాలన్నీ క్లారిఫై చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీంతో మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యంతరాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

అంతకుముందు ఈ నెల 7న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాశారు. అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు. మూడేళ్లుగా యూనివర్శిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని లేఖలో గవర్నర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అందులో యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది. దీన్ని ఆమోదించడం వల్ల ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తాయా..? లేదా అనే విషయాలపై వివరణ ఇవ్వాలని మంత్రికి గవర్నర్ సూచించారు.

కాగా.. తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారోమోననే అనుమానం కలుగుతోందని గవర్నర్ చెప్పడం తెలంగాణ లో సంచలనంగా మారింది. మొయినాబాద్ ఫాం హౌస్ అంశంలో రాజ్ భవన్ ను లాగే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు. తన పర్యటలో ప్రోటోకాల్‌ పాటించడం లేదని ఫైర్ అయ్యారు గవర్నర్. కొమరవెల్లి మల్లన్న దర్శనం పూర్తి చేసుకొని తమిళిసై దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు. బైరాన్ పల్లి గురించి కొంతమంది విద్యార్థులు తనకు చెప్పారన్న గవర్నర్.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు బైరాన్ పల్లి పోరాట చరిత్రను చెప్పారన్నారు. విద్యార్థులు విజ్ఞప్తి మేరకు బైరాన్ పల్లికి వచ్చినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం