Revanth Reddy – Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. డిప్యూటీ సీఎం పదవితోపాటు.. వీడియో చూశారా..?

|

Jul 27, 2024 | 5:30 PM

అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.. అది కూడా డిప్యూటీ సీఎం పదవితోపాటు.. ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానంటూ పేర్కొన్నారు.

Revanth Reddy - Akbaruddin Owaisi: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. డిప్యూటీ సీఎం పదవితోపాటు.. వీడియో చూశారా..?
Revanth Reddy - Akbaruddin Owaisi
Follow us on

తెలంగాణ అసెంబ్లీలో దుమ్మురేపే చర్చ జరుగుతోంది.. విపక్షాల విమర్శలు.. ప్రభుత్వం కౌంటర్.. ఇలా వాడీవేడిగా బడ్జెట్ పై వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.. ఈ తరుణంలోనే.. శనివారం నాడు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.. అది కూడా డిప్యూటీ సీఎం పదవితోపాటు.. ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానంటూ పేర్కొన్నారు. దీనికి స్పందించిన అక్బరుద్దీన్ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు..

అసెంబ్లీలో ఏం జరిగిందో పరిశీలిస్తే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పదేళ్లు సమయం ఇచ్చారని.. తమకు నాలుగేళ్ల సమయం ఇస్తే చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్ లో మిమ్మల్ని ఓటు అడుగుతానంటూ పేర్కొన్నారు. తాను గతంలో ఓబీసీ వ్యక్తికి టికెట్ ఇచ్చానని.. తమకు కూడా ఓబీసీలపై ప్రేమ ఉందని.. ఎంఐఎం అతని గెలుపు కోసం సహకరించాలంటూ కోరారు.. ఈ క్రమంలో.. అక్బరుద్దీన్ స్పందిస్తూ తాము ఎటువెళ్లాలంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.

వీడియో చూడండి..

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీఫామ్‌పై కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ పోటీ చేస్తే గెలిపించే బాధ్యతను తీసుకుంటానని సీఎం రేవంత్ అన్నారు. చీఫ్‌ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి ఆయనను గెలిపిస్తానని తెలిపారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా అక్బరుద్దీన్‌ను తన పక్కనే కూర్చోబెట్టుకుంటానని చెప్పారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

ఇద్దరూ సరదాగా మాట్లాడుకోవడంతో సభలో నవ్వులు విరిశాయి.. ఓ వైపు సీఎం.. మరోవైపు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ వ్యాఖ్యలను అందరూ ఆసక్తిగా వింటూ నవ్వుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..