Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో బండి నిలిపితే మీ జేబు గుల్లే

|

Jun 08, 2022 | 10:39 AM

నిత్యం రద్దీ గా ఉండే ట్యాంక్ బండ్(Tank Bund).. వాహనాలతో కిటకిటలాడుతుంటుంది. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతం ఎప్పుడు చూసినా రద్దీగా దర్శనమిస్తుంది. అయితే ఈ సమయంలో....

Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో బండి నిలిపితే మీ జేబు గుల్లే
Traffic At Tank Bund
Follow us on

నిత్యం రద్దీ గా ఉండే ట్యాంక్ బండ్(Tank Bund).. వాహనాలతో కిటకిటలాడుతుంటుంది. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతం ఎప్పుడు చూసినా రద్దీగా దర్శనమిస్తుంది. అయితే ఈ సమయంలో వాహనాల పార్కింగ్ కొత్త చిక్కులు తెస్తోంది. ఎక్కడపడితే అక్కడ నిలిపేస్తున్న వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ట్యాంక్ బండ్ పై ఇక నుంచి ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకూడదని, అలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నో పార్కింగ్‌ జోన్‌లో(No Parking at Tank Bund) వాహనం పార్కింగ్‌ చేస్తే భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. క్షణాల్లో మొబైల్‌ ఫోన్‌కు రూ.1000 జరిమానా విధిస్తూ సందేశం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నో పార్కింగ్‌ బోర్డులు ఏర్పాటు చేసిన చోట్ల స్పీడ్‌ గన్‌లను కూడా అమర్చారు. నిమిషం కూడా అక్కడ బండ్లు నిలిపే వీలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

నో పార్కింగ్‌ బోర్డులు అడుగడుగునా ఏర్పాటు చేసి.. ఒక వేళ పార్కింగ్‌ చేస్తూ రూ.1000 జరిమానా అంటూ రాయడంతో ఇక వాహనదారులు అప్రమత్తం కావాల్సిందే. తద్వారా వాహనదారులు అప్రమత్తం కావాలని, ఈ నిబంధనలను గమనించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి