Hyderabad: అడ్డంగా దొరికిపోయిన డీజే సిద్దార్థ్.. మాటు వేసి పట్టేసిన పోలీసులు

తనిఖీల్లో మాదాపూర్, గచ్చిబౌలి పబ్బుల్లో డ్రగ్స్ సేవిస్తూ డీజే సిద్ధార్థ్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కొంత కాలంగా అతనిపై పోలీసులు నిఘా ఉంచారు. అతను ఎవరెవరిని కలుస్తున్నాడో వాళ్లందిరిని పిలిచి విచారించారు. దీంతో మరోక వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం అధికారులు డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థ్ ను ప్రత్యేకంగా విచారిస్తున్నారు.

Hyderabad: అడ్డంగా దొరికిపోయిన డీజే సిద్దార్థ్.. మాటు వేసి పట్టేసిన పోలీసులు
DJ Siddharth
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:17 PM

డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థ్ అడ్డంగా దొరికిపోయాడు. కొంతకాలం నుంచి సిద్దార్థ్ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఆయన కదలికలపై పక్కా ఫోకస్ పెట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీజే సిద్ధార్థతో పాటు మరొక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో నిత్యం పబ్బులకు వెళ్తున్న వారిపై ఫోకస్ పెట్టారు. 16మందిని అదుపులోకి తీసుకుని టెస్ట్ చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో ఒకరు డీజే సిద్ధార్థ్, మరొకరు స్వరూప్‌గా గుర్తించారు. కొంతకాలంగా డీజే సిద్ధార్థ్, స్వరూప్ కదలికలపై నార్కోటిక్ పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సిద్దార్థ్, స్వరూప్‌తోపాటు ఇంకెవరెవరు డ్రగ్‌ తీసుకున్నారో దర్యాప్తు చేస్తున్నారు. మరి కొంతమంది అనుమానితులపైనా ఫోకస్ పెట్టారు.

స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనపై చర్యలు చేపడుతున్నామని చెప్పారు తెలంగాణ నార్కొటిక్ బ్యూర్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని…డ్రగ్స్ నిర్మూలనకు మేనేజ్మెంట్లు సహకరించాలని కోరారు. స్కూళ్లల్లో ఒక రిటైర్డ్ పోలీస్‌ను రిక్రూట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. స్టూడెంట్స్ బ్యాగుల్లో ఈ-సిగరెట్స్, గంజా, లిక్కర్ బాటిల్స్ ఉంటున్నాయని.. ప్రతిరోజూ స్కూల్ బ్యాగులను చెక్ చేయాల్సిందేనని చెప్తున్నారు. విద్యాసంస్థల్లో జూనియర్లను కొంతమంది సీనియర్లు డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు తమ దృష్టికొచ్చిందని.. అలర్ట్‌గా ఉండాలని యాజమాన్యాలను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

Latest Articles
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
కడుపు మండిన పేదలు..మహిళా రేషన్‌ డీలర్‌కు చెప్పుల దండవేసి ఊరేగింపు
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
పార్టీ మారిన ఎమ్మెల్యే ఒంటరి వాడయ్యరా..?
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ప్రయాణీకులకు అద్దిరిపోయే గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది..!
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
ఈ చిన్నారులంతా నటీనటులే.. ఆ హీరోయిన్ మరణించింది..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
రోజుకి ఐదు రంగులను మార్చుకునే శివలింగం ఎక్కడ ఉందంటే..
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక.. తటస్థులు ఎటు వైపు?
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా కీలక మార్పులు
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
పృథ్వీరాజ్ కొత్త కారు ధర తెలిస్తే గుండె గుభేల్.. 
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 32 ఏళ్లకే కన్నుమూసిన హీరోయిన్
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..
హాల్‌మార్క్‌తోనే బ్యాంకును బురిడీ కొట్టించిన కేటుగాళ్లు..