తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. వాతావరణ రిపోర్ట్ ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతోపాటు ద్రోణి కొనసాగుతోంది..

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. వాతావరణ రిపోర్ట్ ఇదే..
Rain Alert

Updated on: Jul 21, 2025 | 9:06 AM

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతోపాటు.. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతోపాటు ద్రోణి కొనసాగుతోంది.. అంతేకాకుండా.. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కి.మీ.వేగంతో గాలులు వీస్తాయని.. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

ఏపీ వెదర్ రిపోర్ట్..

సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

సోమవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 3 తర్వాత హైదరాబాద్, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us