Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరం నలువైపులా దంచికొడుతోన్న వాన

|

Sep 02, 2021 | 9:53 PM

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతం-ఆ ప్రాంతం, ఈ కాలనీ-ఆ కాలనీ అని లేదు.. నగరం నలువైపులా భారీ వర్షం పడుతోంది. సడెన్‌గా...

Hyderabad Rains: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. నగరం నలువైపులా దంచికొడుతోన్న వాన
Hyd Rains
Follow us on

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ ప్రాంతం-ఆ ప్రాంతం, ఈ కాలనీ-ఆ కాలనీ అని లేదు.. నగరం నలువైపులా భారీ వర్షం పడుతోంది. సడెన్‌గా మొదలై.. చూస్తుండగానే కుండపోతగా మారడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కొన్నిచోట్ల రోడ్లపై మోకాల్లోతు నీరు నిలిచింది. ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసుఫ్‌గూడ, మధురానగర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. భారీ వర్షంలో ట్రాఫిక్‌ కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దుమారం రావడంతో పలుచోట్ల చెట్లు కూడా నేలకొరిగాయి. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గింది. ఇటు భారీ వ‌ర్షానికి పలు చోట్ల విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింది. అక్క‌డ‌క్క‌డ ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఇటు వర్షంపై జీహెచ్ఎంసీ అలెర్టయ్యింది. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, బాలానగర్, ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, మణికొండ ప్రాంతాల్లో మరింత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read:September 2: ఈ డేట్‌ హిస్టరీలో నిలిచిపోతుంది.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజంతా వీరే ట్రెండింగ్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. రేపే ఈడీ ముందకు రకుల్ ప్రీత్