Hyderabad City: డబుల్ డెక్కర్ బస్సుల అంశంలో పురోగతి.. విజయవంతంగా తొలి అడుగు పూర్తి..

|

Mar 06, 2021 | 9:25 PM

Double-decker bus: ఒక్కప్పుడు నగర వాసులను అలరించిన డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ రోడ్డెక్కించేందుకు టీఎస్ఆర్టీసీ మొదటి అడుగు..

Hyderabad City: డబుల్ డెక్కర్ బస్సుల అంశంలో పురోగతి.. విజయవంతంగా తొలి అడుగు పూర్తి..
Follow us on

Double-decker bus: ఒక్కప్పుడు నగర వాసులను అలరించిన డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ రోడ్డెక్కించేందుకు టీఎస్ఆర్టీసీ మొదటి అడుగు విజయవంతంగా వేసింది. డబుల్ డెక్కర్ బస్సుల తయారీకి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న టెండర్ల ప్రక్రియను టీఎస్ఆర్టీసీ ఇవాళ పూర్తి చేసింది. అధునాతన పరిజ్ఞానంతో హైదరాబాద్ రోడ్లపై బస్సులను తిప్పేందుకు వాహనాల తయారీ దిగ్గజ సంస్థ ఆశోక్ లే లాండ్ ముందుకు వచ్చింది. ఒకే సంస్థ టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నడంతో ఆ సంస్థనే ఫైనల్ చేశారు.

ఇటీవల ఓ నెటిజన్ డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ హైదరాబాద్ రోడ్లపైకి వస్తే ఎలా ఉంటుంది?.. అంటూ మంత్రి కేటీఆర్‌కు చేసిన ట్విట్ మళ్ళీ హైదరాబాద్‌ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేలా చేసింది. సాధ్యసాధ్యాలు పరిశీలించాలంటూ రవాణా శాఖ మంత్రికి కేటీఆర్ రీ ట్వీట్ చేసి నగరవాసుల డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కే కలను సాకారం చేయబోతున్నారు. అందులో భాగంగా గత కొన్ని నెలలుగా నగర రోడ్లపై తిరిగే అంశంపై ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి. ప్రస్తుత హైదరాబాద్ నగర వీధుల్లో తిరిగేందుకు అవకాశాలను పరిశీలించారు. చివరిగా నగరంలో కొన్ని రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను తిప్ప వచ్చని నిర్ణయించుకున్న తరువాత అధునాతన పరిజ్ఞానంతో బస్సులు తయారు చేసే కంపెనీల నుంచి టెండర్లను పిలిచారు. కానీ ఆర్టీసీ అధికారులు పెట్టిన ప్రతిపాదనకు ముందుగా బస్సుల తయారీ కంపెనీలు ముందుకు రాలేదు. సంస్థ చెబుతున్న రెట్లకు ముందుగా ఏ సంస్థ ముందుకు రాలేదు. గత నెల 18వ తేదీ నే ఫైనల్ కావాల్సిన ఈ టెండర్ల ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. చివరికి టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది.

డబుల్ డెక్కర్ బస్సులపై హైదరాబాద్ సిటిజన్స్ నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకరు ఇప్పుడు ఉన్న బస్సులకే దిక్కు లేదు అంటే.. మరొకరు డబుల్ డెక్కర్ వస్తే డీజిల్ ఖర్చు తగ్గుతది అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. మెట్రో వచ్చాక ఇక డబుల్ డెక్కర్‌తో అసలు పనేంటి అంటున్నారు.

Also read:

Fake HRC : అమీన్ పూర్ స్థలాలపై కన్ను, పైకి పెద్ద ఆఫీసర్‌లా బిల్డప్, హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో బ్లాక్ మెయిలింగ్

ఒక్క సెల్ఫీతో డ్రైవింగ్ లైసెన్స్.. ఆన్‌లైన్‌లో లైసెన్స్ రెన్యువల్‌.. అందుబాటులోకి రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు