అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టిన సీపీ సజ్జనార్.. అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్

|

Mar 16, 2021 | 8:18 AM

CP Sajjanar: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ ఇటీవల అదనపు డీజీలుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జనార్‌,

అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టిన సీపీ సజ్జనార్.. అభినందించిన ముఖ్యమంత్రి కేసీఆర్
Cm Kcr Cp Sajjanar
Follow us on

CP Sajjanar: సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ ఇటీవల అదనపు డీజీలుగా పదోన్నతి పొందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సజ్జనార్‌, అనిల్‌కుమార్‌ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ వారిని అభినందించి వారితో మాట్లాడారు. అనంతరం వారు హోం మంత్రి మహమూద్‌ అలీ కలిశారు. అదేవిధంగా ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ అధికారిగా నియమితురాలైన ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి శోభ సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

బాధ్యతలు చేపట్టిన సజ్జనార్..
సజ్జనార్ సోమవారం అదనపు డీజీగా బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సజ్జనార్‌ గౌరవ వందనాన్ని అందుకున్నారు. కాగా.. ఐజీ హోదాలో రెండున్నరేళ్లపాటు పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్‌కు ఇటీవల అదనపు డీజీగా పదోన్నతిని కల్పిస్త సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. దీంతో అదనపు డీజీ హోదాలో సీపీ సజ్జనార్‌ సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా విధులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పులువురు సిబ్బంది సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: