Telangana: సొంత గూటికి చేరుతున్న నేతలు.. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్

| Edited By: Ravi Kiran

Jul 05, 2022 | 11:54 AM

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. వివిధ కారణాలతో పార్టీని వీడిన నేతలంతా మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సంర టైమ్‌ ఉండగానే తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కాక రేపుతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీ...

Telangana: సొంత గూటికి చేరుతున్న నేతలు.. తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త జోష్
Badungpet Mayor
Follow us on

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ కనిపిస్తోంది. వివిధ కారణాలతో పార్టీని వీడిన నేతలంతా మళ్లీ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సంర టైమ్‌ ఉండగానే తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కాక రేపుతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీ నువ్వానేనా అంటూ హోరాహోరీగా తలపడుతుంటే, తాను కూడా పోటీలో ఉన్నానంటూ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతోంది కాంగ్రెస్ పార్టీ. 2023 లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసి మీదున్న కాంగ్రెస్‌, ఆపరేషన్‌ ఆకర్ష్‌పై ఫోకస్‌ పెట్టింది. మెయిన్‌గా కాంగ్రెస్‌ను వదిలివెళ్లిన లీడర్స్‌ను వెనక్కి రప్పించే పనిలో పడింది. ఆపరేషన్‌ స్వగృహ చేపడుతూ మాజీ నేతలపై గురిపెట్టడంతో, బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నరసింహారెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ లీడర్‌ భట్టి నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఇది ఆరంభం మాత్రమే ముందుముందు ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారని సీఎల్పీ లీడర్‌ భట్టి విక్రమార్క చెప్పడం విశేషం.

కాగా.. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో వివాదం ముదురుతోంది. జాగ్గారెడ్డి-రేవంత్‌ రెడ్డిల మధ్య హీట్‌ పెరుగుతోంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సొంత కుంపటిలోనే ఒకరిపై ఒకరు సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. నిన్న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా విషయంలో రేవంత్‌ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాడంటూ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్‌ అయ్యారు. దీంతో రేవంత్‌ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు జగ్గారెడ్డి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రేపు ఒక సంచలన నిర్ణయం తీసుకుంటానని జగారెడ్డి ఒక ప్రకటన విడుదల చేయడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి