ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్ష సూచన వెలువడింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఏపీలోనూ పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం వెదర్ రిపోర్ట్ చూడండి..

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఇదిగో వెదర్ రిపోర్ట్
Weather Alert

Updated on: Sep 28, 2026 | 7:01 AM

వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. ఆ తర్వాత.. వర్షాలు తగ్గుముఖం పట్టాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్ష ప్రభావం ఉండనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది.

ఏపీలో కూడా వర్షాలు..

ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం (28-09-26) విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలియజేసింది . మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us