Weather Update: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్ 

Telangana and Andhra Pradesh Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండలు మండిపోతున్నాయి.. అంతేకాకుండా.. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Weather Update: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్ 
Telangana and Andhra Pradesh Weather Update

Updated on: Apr 07, 2026 | 4:07 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలు ఎండలు మండిపోతున్నాయి.. అంతేకాకుండా.. సాయంత్రం వేళల్లో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు, వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ద్రోణి/ గాలి అంతరాయం, ఇప్పుడు గంగానది పశ్చిమ బెంగాల్ నుండి, ఒడిశా, దాని పరిసర ప్రాంతాలు, తెలంగాణ, రాయలసీమ – తమిళనాడు ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనము మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. దీంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు బలహీనపడినది. తక్కువగా గుర్తించబడినది. అంతేకాకుండా.. దక్షిణ తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనము ఈ రోజు బలహీనపడినది. తక్కువగా గుర్తించబడినది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

రాయలసీమ :-

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్న తెలంగాణ పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనము నుండి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ద్రోణి ఈరోజు గ్యాంగ్టిక్ వెస్ట్ బెంగాల్ నుండి ఒడిస్సా, తెలంగాణ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలోని దక్షిణ కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది. నిన్న తెలంగాణ పరిసర ప్రాంతాల్లో  కొనసాగిన ఉపరితల చక్రవాక ఆవర్తనం ఈరోజు బలహీన పడింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన:

మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు   ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. తదుపరి క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us