Rain Alert: మళ్లీ వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది..

Rain Alert: మళ్లీ వర్షాలే వర్షాలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వానలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Rain Alert

Updated on: Oct 07, 2025 | 5:20 PM

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నిరోజుల నుంచి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో.. ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని చెప్పింది.. ఉత్తర కోస్తా ఒడిశా నుండి అంతర ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా తూర్పు తెలంగాణ వరకు. సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.. నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నది. నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తమిళనాడు, రాయలసీమ – దక్షిణ అంతర కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉన్నది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండుచోట్ల సంభవించే అవకాశముంది.

రాయలసీమ:-

మంగళవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

బుధవారం గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ హెచ్చరికలు :

ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచన: మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మంగళవారం, బుధవారం, గురువారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో 30 నుండి 40 కి.మీ వేగంతో కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us