Monsoon update: తెలంగాణలో మరో రెండు రోజులు ఇలానే.. ఉప‌రి‌తల ద్రోణి ప్రభావం అని వెల్లడించిన వాతావరణ కేంద్రం

|

Jul 03, 2021 | 9:52 AM

తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సముద్రమట్టానికి 5.7 కిలో‌మీ‌టర్ల వద్ద ఉప‌రి‌తల ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ...

Monsoon update: తెలంగాణలో మరో రెండు రోజులు ఇలానే.. ఉప‌రి‌తల ద్రోణి ప్రభావం అని వెల్లడించిన వాతావరణ కేంద్రం
Monsoon Update
Follow us on

తెలంగాణ జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. సముద్రమట్టానికి 5.7 కిలో‌మీ‌టర్ల వద్ద ఉప‌రి‌తల ద్రోణి కొన‌సా‌గు‌తు‌న్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభా‌వంతో శని, ఆది‌వా‌రాల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని  తెలి‌పింది. ఒకటి రెండు ప్రదే‌శాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన వర్షం పడొచ్చని పేర్కొంది.

గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, ములుగు, నల్గొండతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.

అత్యధికంగా మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి.  బయ్యారంలో 11, దొంగల ధర్మారం(మెదక్‌)లో 10.7, దహేగాం(కుమురం భీం జిల్లా)లో 10, మెదక్‌, బూర్గుంపాడులో 9, పెగడపల్లి(జగిత్యాల)లో 8, ఇల్లెందులో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 7 డిగ్రీల వరకూ తగ్గడంతో వాతావరణం చల్లబడింది. శుక్రవారం పగలు అత్యధికంగా భద్రాచలంలో 27.8 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదయింది.

ఇవి కూడా చదవండి : Tirath Singh Rawat: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ రాజీనామా.. ఎమ్మెల్యేగా ఎన్నికవ్వకపోవడంతో..

Bandla Ganesh: అంతరిక్షంలోకి వెళుతోన్న తొలి తెలుగు మహిళ.. బండ్ల గణేశ్‌కు బంధువా.? వైరల్‌గా మారిన ట్వీట్‌..