Huzurabad By-Election: హుజూరాబాద్ బైపోల్స్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ.. పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు

|

Oct 09, 2021 | 4:01 PM

Telangana Congress: హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం మండలాల వారిగా ఇంఛార్జ్ లను తెలంగాణ కాంగ్రెస్ నియమించింది. పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేం నరెందర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు.

Huzurabad By-Election: హుజూరాబాద్ బైపోల్స్‌లో కాంగ్రెస్ గట్టి పోటీ.. పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డికి కీలక బాధ్యతలు
Seethakka, Jagga Reddy
Follow us on

Huzurabad By-Elections 2021: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా మండలాల వారిగా ఇంఛార్జ్ లను తెలంగాణ కాంగ్రెస్ నియమించింది. పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేం నరెందర్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇంఛార్జ్‌గా నియమించారు. అలాగే మరికొందరు నేతలకు మండలాల వారీగా చీఫ్ కో ఆర్డినేటర్‌గా నయమించారు.

మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌.. చీఫ్ కో ఆర్డినేటర్

కమలాపురం మండలం ఇంఛార్జ్ గా సీతక్క ,చీఫ్ కో ఆర్డినేటర్ నాయిని రాజెందర్ రెడ్డి…

హుజూరాబాద్ మండల ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే జగ్గారెడ్డి , చీఫ్ కో ఆర్డినేటర్ గా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు..

జమ్మికుంట మండలం ఇంఛార్జ్ గా ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ,చీఫ్ కో ఆర్డినేటర్ గా విజయరమణారావు..

ఇల్లంతకుంట మండలం ఇంఛార్జ్ గా వేం నరెందర్ రెడ్డి ,చీఫ్ కో ఆర్డినేటర్ గా జంగా రాఘవ రెడ్డి ..

వీణవంక మండలం ఇంఛార్జ్ గా ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ,చీఫ్ కో ఆర్డినేటర్ గా ఆది శ్రీనివాస్..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా తెలంగాణ కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బలమూరు వెంకట్ బరిలో నిలుస్తున్నారు. ఈ నెల 30న హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. నవంబరు 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Also Read..

MAA Elections 2021: మా అధ్యక్ష పదవి కోసం మోనార్క్ vs మంచు.. ఇద్దరి బలాలు, బలహీనతలు ఏంటో తెలుసా?

కేంద్ర మంత్రి అమిత్‌షా నివాసం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తం..!