
Telangana Weather: మళ్లీ వానలు షురూ అవ్వనున్నాయి. అవును.. మరోసారి రాజధాని హైదరాబాద్(Hyderabad)కు వర్ష సూచన జారీ చేసింది వాతావరణశాఖ. మరికొన్ని గంటల్లో కూకట్ పల్లి(Kukatpally)లో భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నగరంలోకి అల్వాల్, కుత్బాల్లాపూర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో సాధారణం నుండి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఈమేరకు DRF బృందాలను అలర్ట్ చేసారు GHMC అధికారులు. మరోవైపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాగల 5 రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వెల్లడించింది. బుధవారం తొమ్మది జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, ఖమ్మం, నల్లొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
29వ తేదీన రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం బీమ్ ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి