Harish Rao: చర్చకు ప్లేస్‌, డేట్‌, టైమ్‌ చెప్పాలి.. రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు సవాల్..

|

Aug 17, 2024 | 3:22 PM

తెలంగాణలో పాలిటిక్స్‌ పీక్స్‌కి చేరాయి. అధికార, ప్రతిపక్ష నేతలు.. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మాటలతోనే డైనమైట్లు పేల్చుతున్నారు.. రోజుకో ఇష్యూ మీద ఫుల్‌గా ఫైట్‌ చేయడమే కాదు... సవాళ్లు, ప్రతిసవాళ్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా రుణమాఫీ అంశం రాజకీయ రణరంగానికి దారి తీసింది. మాటలనే తూటాలుగా చేసి... ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు.

Harish Rao: చర్చకు ప్లేస్‌, డేట్‌, టైమ్‌ చెప్పాలి.. రుణమాఫీపై సీఎం రేవంత్‌ రెడ్డికి హరీష్ రావు సవాల్..
CM Revanth Reddy, Harish Rao
Follow us on

తెలంగాణలో పాలిటిక్స్‌ పీక్స్‌కి చేరాయి. అధికార, ప్రతిపక్ష నేతలు.. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మాటలతోనే డైనమైట్లు పేల్చుతున్నారు.. రోజుకో ఇష్యూ మీద ఫుల్‌గా ఫైట్‌ చేయడమే కాదు… సవాళ్లు, ప్రతిసవాళ్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా రుణమాఫీ అంశం రాజకీయ రణరంగానికి దారి తీసింది. మాటలనే తూటాలుగా చేసి… ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. 2 లక్షల రుణమాఫీ అవ్వగానే… సీఎం రేవంత్‌రెడ్డి తనదైన స్టైల్‌లో బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు.. మాజీ మంత్రి హరీశ్ రావు టార్గెట్ గా సవాల్ చేశారు.. ఆగస్ట్‌ 15లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన హరీశ్ రావు.. ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి మరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే.. హరీష్ రావు.. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.. రుణమాఫీపై తాను చర్చకు రెడీ అని.. ప్లేస్‌, డేట్‌, టైమ్‌.. రేవంత్‌ రెడ్డి చెప్పాలి.. అంటూ హరీష్‌రావు సవాల్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు.. పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ గ్రామానికి వచ్చేందుకైనా తాను సిద్ధమని.. రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు. రుణమాఫీ చేశామని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎంత మందికి రుణమాఫీ చేయాలో చెప్పాలని సూచించారు.

రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ మాటతప్పారని హరీష్ రావు అన్నారు. ఆ పాపం రాష్ట్ర ప్రజలకు తగలకుండా ఉండేందుకు తాను ఆయా ఆలయాలకు వెళ్లి దేవుళ్లను వేడుకుంటానని తెలిపారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు రావాలని.. పూర్తిగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ పేర్కొన్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని..రేవంత్‌రెడ్డి మాట తప్పంది నిజం కాదా అంటూ హరీష్‌రావు పేర్కొన్నారు.

సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్..

ఇదిలాఉంటే.. సిద్ధిపేటలో ఫ్లెక్సీ వార్ ఉద్రిక్తతకు దారితీసింది.. మాజీ మంత్రి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరుతూ సిద్ధిపేటలో అర్థరాత్రి కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అనంతరం ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..