ఆమెకు మంచి భర్త, ఇద్దరు బిడ్డలు.. కట్ చేస్తే, డెలివరీ బాయ్‌తో ఎఫైర్.. చివరకు..

హనుమకొండ జిల్లా కాజీపేటలో ఓ మహిళ హత్య కేసు కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించిన 20 ఏళ్ల కుమారుడు దారుణానికి పాల్పడ్డాడు. కేసులో కుమారుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

ఆమెకు మంచి భర్త, ఇద్దరు బిడ్డలు.. కట్ చేస్తే, డెలివరీ బాయ్‌తో ఎఫైర్.. చివరకు..
Hanamkonda Mother Murder

Edited By:

Updated on: Sep 27, 2026 | 9:09 AM

ఇద్దరు కన్న బిడ్డలు.. మంచి భర్త.. అల్లారుముద్దుగా సాగుతున్న ఆమె జీవితంలోకి ఓ డెలివరీ బాయ్ ఎంటర్ అయ్యాడు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతనితో పరిచయం పెంచుకున్న ఆ మహిళ తన భర్త-కన్నబిడ్డలను వదిలేసి అతనితో వెళ్లిపోవడానికి రెడీ అయింది. అప్పటికే ఆ డెలివరీ బాయ్ తో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న ఆ మహిళను డిగ్రీ చదువుతున్న తన కన్నకొడుకు మందలించాడు. వద్దమ్మా పద్ధతి మార్చుకో అని బుద్ధిగా నచ్చ చెప్పాడు.. కానీ మైకంలో కళ్ళు మూసుకుపోయిన ఆ తల్లి ఆ డెలివరీ బాయ్‌తో వెళ్లిపోవడానికి రెడీ అయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ కొడుకు గుండెరాయి చేసుకుని కన్నతల్లిని కత్తితో గొంతుకోసి హత మార్చాడు.. కసాయి కొడుకుగా ముద్ర వేసుకొని కటకటాల పాలయ్యాడు.. ఈ దారుణ సంఘటన హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో జరిగింది.. ఉదయశ్రీ (40) అనే మహిళ తన ఇంట్లోనే హత్యకు గురైంది.. ఇనుపరాడ్డుతో కొట్టి కత్తితో గొంతుకోసి హతమార్చిన ఆనవాళ్లు లభించాయి.

దీంతో పోలీసులు కొడుకు దొరబాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో కొడుకు దొరబాబు(20) హత్య చేసినట్లు నిర్ధారణ అయింది.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆ విద్యార్థికి తన తల్లి ప్రవర్తన నచ్చక ఆ తల్లి తప్పటడుగులు వేస్తుండడం ఇష్టంలేక అతికిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు ఉదయశ్రీ కి 20 ఏళ్ల వయస్సు ఉన్న కొడుకు, కూతురు, భర్త ఉన్నారు.. ఈ క్రమంలోనే రాజశేఖర్ అనే ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్న ఉదయశ్రీ అతనితోనే జీవితం పంచుకోవాలనికుంది.. అతనికి కూడా పెళ్లై పిల్లలు ఉన్నారు.. కానీ ఇద్దరు కుటుంబాలని వదిలేసి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ విషయం ఉదయశ్రీ కొడుకు దొరబాబు కు తెలియడంతో తల్లితో వాదించాడు.. వద్దమ్మా నువ్వు చేసేది తప్పని మందలించాడు.. కానీ ఏదో తెలియని మైకంలో కళ్ళు మూసుకుపోయిన ఆ తల్లి ఆ డెలివరీ బాయ్ తో వెళ్లి పోవడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలో ప్రాణంకంటే పరువే ముఖ్యమని భావించిన ఆ డిగ్రీ విద్యార్థి దొరబాబు సహనం కోల్పోయాడు.. తన తల్లిని అతికిరాతకంగా హత్య చేశాడు.. ఇనుప రాడ్డుతో కొట్టి కత్తితో మెడ భాగంలో పొడిచాడు.. దీంతో ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యకు పాల్పడిన మృతురాలి కొడుకు దొరబాబును అరెస్టు చేశారు.. డెలివరీ బాయ్ తో ఆ మహిళ సహజీవనం చేయడానికి సిద్ధమవ్వడం వల్లే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.. పరారీలో ఉన్న ఆ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ రాజశేఖర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, ఈ హత్యపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వెల్లువెత్తున్నాయి.. కొందరు నెటిజన్లు కొడుకు చర్యలను సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు.. ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us