Telangana News: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య.. భద్రాద్రి జిల్లాలో విషాదం..

|

Apr 14, 2022 | 12:15 PM

Thati Venkateswarlu daughter suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది.

Telangana News: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె ఆత్మహత్య.. భద్రాద్రి జిల్లాలో విషాదం..
Thati Venkateswarlu
Follow us on

Thati Venkateswarlu daughter suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆమె ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మహాలక్ష్మి ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతుందని కటుంబసభ్యులు పేర్కొన్నారు. తాటి వెంకటేశ్వర్లు స్వగ్రామం బూర్గంపాడు మండలం సారపాకలో ఈ ఘటన చేసుకుంది. సమాచారం అందుకున్న తాటి వెంకటేశ్వర్లు దమ్మపేట నుంచి బూర్గంపాడులోని సారపాక చేరుకున్నారు. కూతురుని చూసి గుండెలవిసేలా రోదించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకోని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు తాటి ఇంటికి చేరుకుంటున్నారు.

కాగా.. మహాలక్ష్మి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా.. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా.. ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను కిందికిదించి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

Also Read:

AP News: అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం.. గ్యాస్ లీకేజీతో ఎగిసిపడ్డ మంటలు.. ఆరుగురు దుర్మరణం

YS Jagan: అక్కిరెడ్డిగూడెం ఫ్యాక్టరీ ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. బాధితుల కుటుంబాలకు పరిహారం

Ambedkar Jayanti 2022: అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. హక్కుల కోసం గొంతెత్తిన స్వరం.. భీమ్‌రావ్ అంబేద్కర్