Konda Surekha: పెంపుడు శునకానికి నివాళులర్పిస్తూ.. కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి కొండా సురేఖ.. వీడియో

Konda Surekha tribute to pet dog: కుక్కలు విశ్వాసానానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. అందుకే చాలామంది కుక్కలను ఇష్టంగా కుటుంబసభ్యుల్లా పెంచుకుంటారు. ఎటువెళ్లినా సరే వాటిని

Konda Surekha: పెంపుడు శునకానికి నివాళులర్పిస్తూ.. కన్నీటి పర్యంతమైన మాజీ మంత్రి కొండా సురేఖ.. వీడియో

Updated on: Oct 31, 2021 | 8:37 AM

Konda Surekha tribute to pet dog: కుక్కలు విశ్వాసానానికి ప్రతిరూపంగా నిలుస్తాయి. అందుకే చాలామంది కుక్కలను ఇష్టంగా కుటుంబసభ్యుల్లా పెంచుకుంటారు. ఎటువెళ్లినా సరే వాటిని వెంటపెట్టుకొని మరి వెళుతుంటారు. అవి కొంచెం అనారోగ్యం బారిన పడినా సరే.. ఆ కుటుంబంలోని సభ్యులెవరూ తట్టుకోలేరు. తాజాగా.. మాజీ మంత్రి కొండా సురేఖ తన పెంపుడు శునకం సోనూ మరణించడం పట్ల తీవ్ర విషాదానికి లోనయ్యారు. పెంపుడు కుక్కకు కన్నీటి నివాళులర్పించారు. తమ కుటుంబంలో కలిసిపోయిన శునకం మృత్యువాతపడడంతో కొండా సురేఖ కన్నీరుమున్నీరయ్యారు. ఓ కుటుంబ సభ్యుడు దూరమైనంతగా ఆమె రోదించారు. ఈ సంఘటన చూపరులను కలచివేసింది. దాన్ని ఒళ్లోకి తీసుకుని ఆమె విలపించడం చూసి.. అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అవుతోంది.

వీడియో..

పెంపుడు కుక్కను మాజీ మంత్రి కొండా సురేఖ ఎలా చూసుకున్నారో.. ఈ వీడియో చూస్తే అర్ధమవుతుందంటూ జంతు ప్రేమికులు పేర్కొంటున్నారు. ఈ వీడియోను చూసి పలువురు నెటిజన్లు పలు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Crime News: అమెరికాలో దారుణం.. తెలుగు వ్యాపారవేత్తను కాల్చి చంపిన దుండగుడు.. 80 కిలోమీటర్లు వెంబడించి

MGNREGA: ఉపాధి హామీ పథకం నిధుల విడుదల ఎప్పుడు? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..