
ప్రతీ ఆచారం వెనుక ఒక అర్థం ఉంటుంది.. సాంప్రదాయం అంటేనే ఓ నమ్మకం.. దసరా పర్వదిన దిష్టి తొలగింపు కోసం గుమ్మడికాయలు కొట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. అసలు దసరా పర్వదినానికి గుమ్మడికాయకు సంబంధం ఏంటి.. వాహనాలు, ఇళ్ళ ముందు ఎందుకు గుమ్మడి కాయలు కొడతారు.. దసరా పర్వదినాన ఇంటిముందు గుమ్మడికాయ కొట్టడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి.. నిజంగా ఒక్క గుమ్మడికాయ 100 మేకలతో సమానమా.. ఈ కథనంలో తెలుసుకుందాం..
దసరా వచ్చేసింది.. కూష్మాండం బద్దలు కొట్టాల్సిందే.. గుమ్మడికాయల వ్యాపారం జోరుగా సాగుతుంది.. పూలు వస్త్ర వ్యాపారాలకు సమాంతరంగా రాచ గుమ్మడి, బూడిద గుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది
విజయదశమి రోజు గుమ్మడికాయ కొడితే విజయాలు దరిచేరుతాయననే నమ్మకం.. నర దృష్టి తోలిగిపోతుందని విశ్వాసం.. ఒక్క గుమ్మడికాయ కొడితే వంద మేకలను బలిచ్చిన శక్తి లభిస్తుందని నమ్ముతుంటారు చాలా మంది..
దసరా పర్వదినాన ప్రతిఒక్కరూ వాహన పూజ చేయించుకుంటారు.. ఆ వాహనం ముందు రాచ కాయను కొట్టి ఆ వాహనానికి నిమ్మకాయలు, జీడిగింజలు, పచ్చిమిర్చి, గవ్వలు కట్టి ఎలాంటి ప్రమాదాలు దరిచేరవద్దని కోరుకుంటారు.. ఆ వాహనానికి గుమ్మడికాయ కొట్టి నరదృష్టి తొలిగిపోవాలని కోరుకుంటారు.
దసరా పండుగ సందర్భంగా ప్రతి ఇంటి ముందు రాచ గుమ్మడి కొట్టి, బూడిద గుమ్మడికాయను ఇంటికి దృష్టిదోషం కలుగకుండా కొట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది.. ఎంత కోటీశ్వరులైనా ఇంటి ముందు దసరా రోజు గుమ్మడికాయ కడతారు..
ప్రతి ఆచార సాంప్రదాయ వెనక పూర్వికులు నుండి ఒక నమ్మకం కొనసాగుతుంది.. కాలం మారిన ఆచారాలు మాత్రం మానవు అనడానికి ఈ కూష్మాండబలి ఒక నిదర్శనం.. దసరా వేళ గుమ్మడికాయ కట్టడం ఆచారం మాత్రమే కాదు తరతరాలుగా కొనసాగుతున్న విశ్వాసానికి ప్రత్యేకంగా కొనసాగుతుంది.. పండుగకు సాంప్రదాయం తోడవడంతో గుమ్మడికాయల వ్యాపారం జోరుగా సాగుతుంది..
దసరా రోజు గుమ్మడికాయతో దిష్టి తీసినా.. వాహనాలు , ఇళ్ళ ముందు గుమ్మడికాయ కొట్టినా.. ఆ ఇంట విజయాలు చేకూరుతాయని ప్రజల విశ్వసిస్తున్నారు. ప్రతి దసరాకు వరంగల్ లో సుమారు ఒక కోటి రూపాయల మేర గుమ్మడికాయల వ్యాపారం జరుగుతుందంటే నమ్ముతారా..! కానీ ఇది నిజం..
వాహనాల ముందు గుమ్మడికాయ కొట్టినా.. ఇంటిముందు గుమ్మడికాయ కొట్టినా.. దుకాణాల ముందు గుమ్మడికాయ కొట్టినా.. వంద పొట్టేళ్లను బలిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. ఒక్క గుమ్మడికాయను కొడితే అంతటి శక్తి లభిస్తుందని పెద్దలు విశ్వసిస్తుంటారు..
అయితే.. ఇది కేవలం నమ్మకం మాత్రమే.. శాస్త్రీయంగా కరెక్ట్ కాదని చెబుతున్నారు జన విజ్ఞాన వేదిక నిపుణులు..