Telangana Assembly: తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే

| Edited By: Velpula Bharath Rao

Dec 19, 2024 | 10:57 AM

తెలంగాణలో గత రోజులుగా శీతకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సమావేశాల నుంచి బయటకు వచ్చి ఓ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఇంతకీ ఆ పాప ఎవరు?

Telangana Assembly: తాతకి తెలియకుండా అసెంబ్లీకి మనమరాలు.. కట్ చేస్తే.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఎమ్మెల్యే
Cpi Mla Kunamneni Sambasiva Rao With Her Grand Daughter
Follow us on

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే వాటిని చూసేందుకు ప్రజల్లోనూ, విద్యార్థుల్లోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. మన ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తాయి, చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుందో విద్యార్థులకు తెలిపేందుకు ఆయా పాఠశాలలు విద్యార్థులను అసెంబ్లీ సమావేశాలకు తీసుకొని వస్తారు. గ్యాలరీ పాసులు తీసుకొని విద్యార్థులకు సమావేశాలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు.

అలా బుధవారం ఓ స్కూల్ విద్యార్థులు శాసనసభ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చారు. విద్యార్థులు వచ్చారన్న విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే సమావేశాల నుంచి బయటకు వచ్చి ఓ పాపను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అంతా ఈ విషయాన్ని ఆసక్తిగా గమనిస్తుండగా ఆ పాప ఆ ఎమ్మెల్యే మనవరాలని తెలియడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన ఎవరో కాదు కొత్తగూడెం ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివ రావు.. ఆయన కొడుకు కూతురు చదువుతున్న స్కూల్ యాజమాన్యం పిల్లలను అసెంబ్లీ సమావేశాలు చూపించేందుకు తీసుకొని వచ్చారు. ఈ విషయం తెలుసుకొని ఆ స్కూల్ విద్యార్థులలో తన మనుమరాలు ఉందని తెలుసుకొని కలవడానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చారు. తన మనమరాలతో మీ తాత ఎమ్మెల్యే అని మీ స్కూల్ మెంట్స్‌కు చెప్పావా అని అడిగారు. ఎవరికి ఏమి చెప్పలేదు అని తాతకు సమాధానం ఇచ్చింది మనవరాలు.. ప్రస్తుతం దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి