మహిళలకు సీమంతం చేస్తూ ఉండడం మనం చూసి ఉంటాం..కానీ మీరు ఎప్పుడైనా గోవులు, ఇతర పెంపుడు జంతువులకు సీమంతం చేయడం చూసి ఉంటారా? తమ ఇళ్ళల్లో ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కలు, పిల్లులకు సీమంతాలు చేస్తున్నారు. గోవుకు సీమంతం చేసి గోవధను నిర్మూలించాలంటున్నారు మహిళలు..ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా?
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివారులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గోమాతకు ఘనంగా సీమంతం చేశారు. ధనుర్మాసంలో సీమంతం చేస్తే మంచి జరుగుతుందన్న నమ్మకంతో హిందువుల్లో ఉంటుంది. గోవును పూజిస్తే లక్ష్మి దేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. కొందరు మహిళలు గోవుకు కొత్త వస్త్రాలను సమర్పించి, గోమాత ఆరోగ్యాన్ని, జన్మించబోయే బిడ్డకు దీర్ఘాయుష్షు కోరుకుంటూ చెక్క శనగలు, కందులు, బెల్లం, ఉలవలు, సాయ పప్పు, గోధుమ పిండి, అరటి పండు, కూరగాయలు, పూలు, రకరకాల పండ్లు నైవేద్యంగా సమర్పించి సీమంతం వేడుకను కనుల విందుగా చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. హిందువులు గోమాతకు పవిత్రంగా భావించి పూజలు నిర్వహిస్తారు..పలు ఆలయాల్లో గో శాల లు ఏర్పాటు చేసి..వాటి సంరక్షణ చేపడతారు..పవిత్రంగా పూజలు నిర్వహిస్తారు..తెలుగు వారి అతిపెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి.. ఈ పండుగకు తమ ఇండ్ల ముందు గొబ్బెమ్మలు, రంగు రంగుల ముగ్గులతో అలంకరించుకుంటారు. ఢూ డూ బసవన్నలు ఆటలతో సందడి నెలకొంటుంది. ఈ పండుగకు గోవులకు ఘనంగా పూజలు చేస్తారు. అయితే కొందరు గోవులను అక్రమంగా రవాణా చేసి గో-వధకు పాల్పడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల గోవులకు రక్షణ లేకుండా పోయిందని, వాటి సంరక్షణ చూసే వారు లేక ఆకలితో అలమటిస్తూ ఉన్నాయని..ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి