Covid Vaccine Dry Run: మరోసారి డ్రైరన్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్‌

|

Jan 04, 2021 | 11:55 PM

Covid Vaccine Dry Run: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ....

Covid Vaccine Dry Run: మరోసారి డ్రైరన్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్‌
Follow us on

Covid Vaccine Dry Run: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంటే మరోవైపు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇక వ్యాక్సిన్‌ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌ కొనసాగుతోంది. కరోనా టీకా పంపిణీ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రైరన్‌ కార్యక్రమం చేపట్టనుంది. ఈనెల 7,8 తేదీల్లో డ్రైరన్‌ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఈనెల 2న దేశ వ్యాప్తంగా డ్రైరన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పరిధిలో ఆరు కేంద్రాల్లో అధికారులు డ్రై రన్‌ నిర్వహించారు. లబ్దిదారుల డేటాను సేకరించి, వ్యాక్సిన్‌ కేటాయింపు, టీకా సమాచారాన్ని లబ్దిదారులకు, వ్యాక్సిన్‌ వేసే వారికి మొబైల్‌ ద్వారా పంపించడం లాంటి కార్యక్రమాలను ఈ డ్రైరన్‌లో పరిశీలించారు. డ్రైరన్‌ విజయవంతం కావడంతో మరోసారి డ్రైరన్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Also Read: Corona Vaccine Distribution: దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి సర్వం సిద్ధం.. తెలంగాణలో టీకా లెక్క ఎలా ఉందంటే..!