Cotton Prices: రికార్డు స్థాయికి చేరుకున్న తెల్ల బంగారం ధర.. క్వింటా రూ.10 వేలు.. ఎక్కడో తెలుసా..?

|

Jan 07, 2022 | 8:38 AM

Kesamudram market cotton rate: ఈ సీజన్‌లో పత్తి దిగుబడులు తగ్గాయి. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో పత్తికి అనూహ్యంగా ధరలు

Cotton Prices: రికార్డు స్థాయికి చేరుకున్న తెల్ల బంగారం ధర.. క్వింటా రూ.10 వేలు.. ఎక్కడో తెలుసా..?
Cotton Exports
Follow us on

Kesamudram market cotton rate: ఈ సీజన్‌లో పత్తి దిగుబడులు తగ్గాయి. దీంతో అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడింది. దీంతో పత్తికి అనూహ్యంగా ధరలు పెరిగాయి. తాజాగా కేసముద్రంలో రికార్డ్‌ ధర పలికింది తెల్ల బంగారం. తెలుగు రాష్ట్రాల్లో తెల్లబంగారం పండించే రైతులకు మంచి రోజులు వచ్చాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ధర పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బేళ్లకు, గింజలకు మంచి డిమాండ్ ఉంది. దీంతో పోటీ పడి ధర పెంచి పత్తి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు. వారం రోజుల వ్యవధిలోనే క్వింటాల్ పత్తి 8500 రూపాయల నుంచి 10 వేలు దాటింది. ఇలానే కొనసాగితే క్వింటా పత్తి ధర 11 వేలకు చేరే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు అధికారులు. రోజురోజుకు పెరుగుతున్న పత్తి ధరలతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు.

తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కాటన్‌ రేటు అమాంతం పెరిగింది. కేసముద్రం మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తిని 10వేల నూటా ఒక్క రూపాయి పెట్టి కొన్నారు వ్యాపారులు. పత్తిధర కేసముద్రంలో 10 వేలు దాటడంతో, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు రైతులు, మార్కెట్ కమిటీ సభ్యులు. తెల్లబంగారం సాగు చరిత్రలోనే ఆల్ టైమ్స్ రికార్డు ధరలు నమోదవుతున్నాయని అంటున్నారు మార్కెటింగ్‌ శాఖ అధికారులు. అటు కర్నూలు జిల్లా ఆదోని కాటన్ మార్కెట్ లో పత్తి ధరలు రికార్డులకెక్కాయి. ఇదివరకు ఎప్పుడూ ఎక్కడ పలకని ధర ఆదోనిలో నమోదైంది. క్వింటాల్ పత్తి 10వేల ధర పలికింది. దీంతో మార్కెట్లో విక్రయానికి పత్తిని భారీగా తరలిస్తున్నారు రైతులు. నాణ్యమైన పత్తికి ప్రైవేట్‌ వ్యాపారులు 9 వేల దాకా ఇచ్చి గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నారు.

ఇక్కడ కూడా పత్తి క్వింటా 11 వేల వరకు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు వ్యాపారులు. రోజురోజుకూ ధరలు భారీగా పెరడంతో పత్తి కొనేందుకు పోటీ పడుతున్నారు వ్యాపారులు. ఉత్తరాది రాష్ట్రాల్లో పత్తి పంట దెబ్బతినడం, దక్షిణాది రాష్ట్రాల్లోపత్తి నాణ్యతగా ఉండటం వల్ల మంచి ధర లభిస్తోందని చెబుతున్నారు మార్కెటింగ్‌ అధికారులు.

Also Read:

Guinness World Record: జ‌డ‌తో బ‌స్సును లాగింది.. గిన్నిస్‌ బుక్‌లో రికార్డ్‌ సృష్టించింది

Jobs Recruitment: కరోనా ఆంక్షలు విధించకపోతే నిరుద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు..!