Telangana: అంగన్ వాడీ స్కూళ్లపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు..

|

Jul 19, 2024 | 11:15 PM

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను, విద్యావ్యవస్థలో లోపాలను పలువురు విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

Telangana: అంగన్ వాడీ స్కూళ్లపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి.. అధికారులకు కీలక ఆదేశాలు..
Cm Revanth Reddy
Follow us on

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ సమస్యలను, విద్యావ్యవస్థలో లోపాలను పలువురు విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించామని తెలిపారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. అంగన్ వాడీలను ప్లే స్కూల్ తరహాలో మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈ సమావేశంలో తెలిపారు. ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీలలో విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ అంగన్ వాడీలలో విద్యాబోధనకు ఒక టీచర్‎ను నియమించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్ రెడ్డి మేధావులకు వివరించారు.

4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్‎లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్‎కు వెళ్లేందుకు విద్యార్థులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్‎తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు రంగం సిద్దం చేశామన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే గడిచిన పదేళ్లుగా యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ లేదని విద్యావేత్తలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. యూనివర్సిటీలకు డెవలప్మెంట్ గ్రాంట్స్ కేటాయించాలని కోరారు. దీనికి సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వీటితో పాటూ విద్యా, వ్యవసాయ రంగాల సమస్యలపరిష్కారానికి త్వరలో విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. విద్యా కమిషన్ ద్వారా విద్యారంగ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలా అనేక సరికొత్త విప్లవాత్మక మార్పులపై సుదీర్ఘంగా చర్చించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..