Revanth Reddy: అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?

|

Aug 01, 2024 | 8:04 AM

సీఎం రేవంత్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు. బాన్సువాడ ఎమ్మల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్‌లో ఉంటే ఫ్యూచర్‌ బ్రైట్‌గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

Revanth Reddy: అభయహస్తం.. పార్టీ మారిన ఎమ్మల్యేలతో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. అందుకేనా..?
Telangana Congress
Follow us on

పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు. ఈ డిన్నర్‌ మీట్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇటీవల గద్వాల ఎమ్మల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన ఈ మీటింగ్‌కు అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కడియం. శ్రీహరి, కాలే యాదయ్య, డాక్టర్. సంజయ్, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌తో సీఎం రేవంత్‌ భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లోనే కొనసాగితే మంచి భవిష్యత్‌ ఉంటుందని, అందరికీ ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణమోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చినట్లే వచ్చి.. తిరిగి గులాబీ జెండా ఎత్తుకోవడంతో అంతా షాక్‌ అయ్యారు. స్థానిక నేతలతో పడకపోవడంతోనే తిరిగి బీఆర్‌ఎస్‌ వైపు వెళ్లారు కృష్ణమోహన్‌రెడ్డి. పాత పరిచయాలతో తెల్లం వెంకట్రావును బీఆర్‌ఎస్‌ఎల్పీలోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలు భుజం మీద చేయివేసి మాట్లాడిన సమయం ఫొటో లీక్‌ అవడంతో.. పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో డిన్నర్‌ భేటీకి తెల్లం వెంకట్రావు కూడా హాజరయ్యారు.

వీడియో చూడండి..

భేటీ ముగిసిన అనంతరం టీవీ9తో మాట్లాడిన భద్రాచలం ఎమ్మల్యే.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇక బీఆర్‌ఎస్‌ వైపు మళ్లిన కృష్ణమోహన్‌రెడ్డి త్వరలోనే కేసీఆర్‌ను కలవనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..