Telangana: భద్రాచలంలో సహాయకచర్యలను వేగవంతం చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశం

|

Jul 15, 2022 | 3:07 PM

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. వరద ప్రవాహం ఇంకా పెరగవచ్చన్న అధికారుల హెచ్చరికలు...

Telangana: భద్రాచలంలో సహాయకచర్యలను వేగవంతం చేయండి.. సీఎం కేసీఆర్ ఆదేశం
Cm Kcr On Bhadrachalam Floo
Follow us on

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. వరద ప్రవాహం ఇంకా పెరగవచ్చన్న అధికారుల హెచ్చరికలు స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితి పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) స్పందించారు. భద్రాచలం వద్ద వరద సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు రక్షణ సామగ్రి తరలించేలా చర్యలు తీసుకోవాలి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు సీఎం సూచించారు. సహాయకచర్యలకు హెలికాప్టర్‌ను అందుబాటులో ఉంచాలని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కేసీఆర్‌ మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు భద్రాచలం పట్టణంలోని పలు ప్రాంతాలను వరదనీరు చుట్టుముట్టింది. రామయ్య ఆలయాన్ని వరద నీరు తాకింది. పట్టణంలోని కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, శాంతినగర్‌ పిస్తా కాంప్లెంక్స్‌ ఏరియా, సుభాష్‌ నగర్‌ తదితర ప్రాంతాలు నీట మునిగాయి. వరద కారణంగా చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు, పినపాక మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం దాల్చింది. అంచనాకు మించి ప్రమాదకరస్థాయికి చేరింది. క్షణక్షణానికి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భారీగా వరద పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో 67.10 అడుగులకు చేరింది. దిగువకు 22.03,857 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు.

మరికొన్ని గంటల్లో గోదావరి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం ఉందని పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..