Haritha Nidhi: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్లపై అద‌నంగా హ‌రిత నిధి రుసుం..

|

Apr 13, 2022 | 9:01 AM

Telangana Haritha Nidhi: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లకు హరిత నిధి వసూలు చేసేందుకు సిద్ధమైంది.

Haritha Nidhi: కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్లపై అద‌నంగా హ‌రిత నిధి రుసుం..
Haritha Nidhi
Follow us on

Telangana Haritha Nidhi: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జరిగే భూముల రిజిస్ట్రేషన్లకు హరిత నిధి వసూలు చేసేందుకు సిద్ధమైంది. ప్రతి రిజిస్ట్రేషన్‌కు రూ.50 చొప్పున తెలంగాణ హరిత నిధిని అధికారులు వసూలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ సందర్భంగా ఈ మొత్తాన్ని ఈ స్టాంపుల రూపంలో వసూలు చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి 1 తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రిజిస్ట్రేషన్‌ (Registrations) సమయంలో హరితనిధి మొత్తాన్ని వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో హ‌రిత నిధి రుసుంను వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ‌రితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కులు నాటి.. పెంచుతున్న విషయం తెలిసిందే. దీనిలో ప్రజలను మరింత భాగ‌స్వామ్యం చేసేందుకు, నిధులను సమకూర్చేందుకు హ‌రిత నిధి రుసుంను ప్రభుత్వం వ‌సూలు చేయ‌నుంది.

Also Read:

Beast Twitter Review: విజయ్ బీస్ట్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించినట్టేనా ?

Crime News: దారుణం.. భర్తను చంపేందుకు మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరితో కలిసి భార్య ఏం చేసిందంటే..