అసలే ఎండాకాలం.. దప్పిక తీరక మనుషులే అల్లాడుతున్నారు.. అలాంటిది మూగజీవాల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అలానే.. దప్పిక తీర్చుకునేందుకు వెళ్లి ఓ బర్రె బావిలో పడింది.. అలా పడిన మూగజీవి.. నాలుగు రోజుల పాటు అంతే ఉండిపోయింది.. చివరకు దానిని గమనించిన గ్రామస్థులు రెస్క్యూ చేసి బతికించారు. ఈ ఘటన యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో చోటుచేసుకుంది. వెంకట్‌రెడ్డికి చెందిన బర్రె నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయింది.. ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. ఆ బర్రెను గ్రామంలోని బావిలో గుర్తించి ఎక్సకవేటర్ సహాయంతో రెస్క్యూ చేశారు. వెంటనే వెటర్నరీ డాక్టర్ మిద్దెల శ్యామ్ దానికి సకాలంలో చికిత్స అందించారు. అయితే.. ఆ బర్రె నాలుగురోజులుగా బావిలోనే ఉన్నట్లు గ్రామస్థులు వెల్లడించారు.
బావిలో బాగా బురద ఉండటం.. లోతు ఎక్కువగా ఉండటంతో అది బయటకు రాలేకపోయిందని.. చివరకు దానిని గుర్తించి ఎక్సకవేటర్ సహాయంతో బయటకు తీసినట్లు వెటర్నటి డాక్టర్, గ్రామస్థులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..