BRS Leaders in Metro: మెట్రో రైల్ ప్రయాణికులతో బీఆర్ఎస్ నేతల ముచ్చట్లు.. తనదైన శైలిలో మల్లారెడ్డి సెటైర్లు

|

Apr 25, 2024 | 2:17 PM

హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రో రైలులో సందడి చేశారు. ఎల్బీనగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు.

BRS Leaders in Metro: మెట్రో రైల్ ప్రయాణికులతో బీఆర్ఎస్ నేతల ముచ్చట్లు.. తనదైన శైలిలో మల్లారెడ్డి సెటైర్లు
Brs Leaders In Metro
Follow us on

హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెట్రో రైలులో సందడి చేశారు. ఎల్బీనగర్‌ నుంచి కూకట్‌పల్లి వరకు మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలోని ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఆరుగురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. మల్కాజ్‌గిరి నివాసి రాగిడి లక్ష్మారెడ్దిని ఎంపీగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే తెలంగాణలో కరువు వచ్చిందన్నారు మల్లారెడ్డి. పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మల్కాజ్‌గిరి బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి. కొడంగల్‌లో ఓడిపోయి, మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి.. ఏనాడు నియోజకవర్గం వైపు తిరిగి చూడలేదని గుర్తు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేేయండి…