KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబానికి బీఆర్‌ఎస్‌ ప్రకటించిన రూ.2.25 కోట్ల ఆర్థిక సాయంలో భాగంగా కుమారుడు, కుమార్తెకు చెరో రూ.కోటి, తల్లిదండ్రులకు రూ.25 లక్షల చొప్పున చెక్కులను కేసీఆర్‌ అందించారు.

KCR: అండగా ఉంటా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Brs Chief KCR

Updated on: Aug 09, 2026 | 7:52 PM

తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలోని పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి KCR నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పెద్ది కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే 2 కోట్ల 25 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం ప్రకటించింది బీఆర్‌ఎస్‌ పార్టీ. అందుకు సంబంధిచిన చెక్కులపై స్వయంగా సంతకాలు చేసి వారికి అందించారు కేసీఆర్. పెద్ది సుదర్శన్ కుమారుడు, కూతురుకు చెరో కోటి, తల్లిదండ్రులకు పాతిక లక్షల రూపాయల చెక్కులను ఇచ్చారు.

కేసీఆర్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ కోసం కృషి చేస్తూ, వరంగల్‌లో కేసీఆర్‌కు ముఖ్య అనుచరుడుగా కొనసాగారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన మరణంతో విషాదంలో మునిగిపోయారు BRS అధినేత కేసిఆర్. ఇవాళ రోడ్డు మార్గంలో తన ఆప్తుని కుటుంబ సభ్యులను వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.

నర్సంపేట నియోజకవర్గం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు అధినేత కేసిఆర్ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు పార్టీ అభిమానులు, కార్యకర్తలు. నర్సంపేట వెళ్తుండగా.. దారి పొడవునా.. ఆయనకు స్వాగతం పలికారు.

Loading...
Unable to load recommendations.
Follow Us