మ‌ద్యం అక్ర‌మ‌ ర‌వాణా చేసిన ఏపీ బీజేపీ నేత సస్పెండ్‌

| Edited By: Pardhasaradhi Peri

Aug 17, 2020 | 3:34 PM

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత గుడివాక‌‌ రామాంజనేయులుపై పార్టీ వేటు వేసింది. ఆయ‌న్ను సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలు జారీ చేశారు.

మ‌ద్యం అక్ర‌మ‌ ర‌వాణా చేసిన ఏపీ బీజేపీ నేత సస్పెండ్‌
Follow us on

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడ్డ బీజేపీ నేత గుడివాక‌‌ రామాంజనేయులుపై పార్టీ వేటు వేసింది. ఆయ‌న్ను సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలు జారీ చేశారు.

క్రమశిక్షణ చర్యల కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోము వీర్రాజు తెలిపారు. పార్టీలో క్రమశిక్షణ లేనివారిని స‌హించ‌బోమ‌ని ఆయన హెచ్చరించారు. 2019లో మచిలీపట్నం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు రామాంజనేయులు. కాగా ఇటీవ‌ల తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి గుంటూరుకు మద్యాన్ని తరలించిన కేసులో ఆయ‌న‌ను స్పెషల్ ఎన్ ఫోర్స్‌మెంట్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 1920 లిక్క‌ర్ బాటిల్స్, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గుడివాక ఏ1 నిందితుడిగా ఉన్నారు.

Also Read:

పబ్​జీ ఆడేందుకు ఫోన్​ ఇవ్వలేదని బ్లేడ్​తో గొంతు కోసుకున్నాడు

కరోనా కొత్త జన్యువు గుర్తించిన మలేసియా : పది రేట్లు వేగంగా వైరస్‌ వ్యాప్తి

ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : ఇక‌పై రైతుభరోసా కేంద్రాల్లో గిరిజన ఉత్పత్తుల అమ్మకం