BJP: బీజేపీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

|

Aug 26, 2022 | 10:43 AM

BJP: తెలంగాణలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అగ్గి రాజుకుంటోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు దిగిన విషయం..

BJP: బీజేపీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్
Follow us on

BJP: తెలంగాణలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య అగ్గి రాజుకుంటోంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రకు దిగిన విషయం తెలిసిందే. పాదయాత్రకు అడ్డుంకులు పడగా, కోర్టు ఆదేశాలతో మళ్లీ ప్రారంభించారు సంజయ్‌. ఇక హనుమకొండలోని ఆర్ట్స్‌ కళాశాలలో బహిరంగ సభ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా, అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో బీజేపీ శ్రేణులు కోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. తమ సభ ఏర్పాటు చేసుకోనివ్వకుండా అనుమతి నిరాకరించారి బీజేపీ నేతలు పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య సభకు అనుమతి రద్దు చేస్తూ లేఖ రాశారు. శనివారం నిర్వహించే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు రానున్నారు. సభకు అనుమతి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా, గత రెండు రోజుల కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రను విరమించుకోవాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇబ్బందులు కలుగతాయనే ఉద్దేశంతో నోటీసులు జారీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి