Telangana: విధ్వంసం ఎవరిది? ధనయజ్ఞం ఎవరిది..? తెలంగాణలో అగ్గిరాజేస్తున్న జల రాజకీయం..

|

Feb 27, 2024 | 6:56 PM

Big News Big Debate: విధ్వంసం వర్సెస్‌ ధనయజ్ఞం. తెలంగాణలో ఇప్పుడు సరికొత్త రాజకీయ నినాదమిది. నీళ్ల నుంచి నిధుల దాకా.. ప్రతీఅంశంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ముదురుతున్న మాటల యుద్ధానికి ఇప్పట్లో పుల్‌స్టాప్‌ పడేలా కనిపించడం లేదు. ఇంతకీ విధ్వంసం సృష్టించిందెవరు? ధనయజ్ఞం చేసిందెవరు? అన్నదే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చర్చనీయాంశంగా మారింది.

వేదిక ఏదైనా.. గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న సీఎం రేవంత్‌, తాజాగా చేసిన కామెంట్స్‌… కాక పుట్టిస్తున్నాయి. నీళ్లపేరిట నిధుల దోపిడీచేసి.. పదేళ్లలో వందేళ్లకు సరిపడా విధ్వంసం సృష్టించారంటూ.. బీఆర్‌ఎస్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

రేవంత్‌ వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. కాళేశ్వరం తెలంగాణకు ఆయువుపట్టన్న ఆయన.. ప్రాజెక్టును కనుమరుగుచేసేందుకు రేవంత్‌ కుట్రచేస్తున్నారని ఆరోపించారు. నాటి కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారని విమర్శించారు.

మరోవైపు, మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ పిలుపునివ్వడంతో వార్‌ ఇంతటితో ఆగదన్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేసిన నీళ్లు, నిధుల మంటలు… ఇంకెన్నాళ్లు సెగలు పుట్టిస్తాయో చూడాలి మరి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..